Azharuddin On tickets Issue: ఇప్పుడు మ్యాచ్ సజావుగా జరగడమే ముఖ్యం.. నేను ఏ తప్పూచేయలేదు: అజారుద్దీన్
అజారుద్దీన్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత తేలికకాదని, తాను ఏ తప్పూచేయలేదని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై మంత్రి తమకు సలహాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మ్యాచ్ సజావుగా జరగడమే ముఖ్యమని చెప్పారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్లన్నీ అయిపోయాయని చెప్పారు. టికెట్ల అమ్మకాలపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు చెబుతామని అన్నారు. తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు.

Azharuddin On tickets Issue
Azharuddin On tickets Issue: ఉప్పల్ వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విషయంలో వివాదం రాజుకోవడం, టికెట్ల కోసం అభిమానులు సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వాహకులు ఇందులో పాల్గొని అన్ని విషయాలను మంత్రికి చెప్పారు. జింఖానా మైదానంలో ఇవాళ టికెట్ విక్రయాలు పూర్తి అయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో అజారుద్దీన్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత తేలికకాదని, తాను ఏ తప్పూచేయలేదని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై మంత్రి తమకు సలహాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మ్యాచ్ సజావుగా జరగడమే ముఖ్యమని చెప్పారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్లన్నీ అయిపోయాయని చెప్పారు.
టికెట్ల అమ్మకాలపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు చెబుతామని అన్నారు. తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నందుకు గర్వపడాలని చెప్పుకొచ్చారు. కాగా, టికెట్ల కోసం ఐదు రోజుల నుంచి భారీగా అభిమానులు తరలివస్తున్నారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాక్లో అమ్ముకుంటోందంటూ ఆందోళనలు చేపట్టారు.