IND vs BAN : సెంచరీతో చెలరేగిన తౌహిద్ హృదయ్.. 5 వికెట్లతో సత్తా చాటిన షమీ.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోరు సాధించింది.

IND vs BAN
బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు తౌహిద్ హృదయ్ (100; 118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదయ్ కాకుండా జాకీర్ అలీ (68; 114 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. నలుగురు బంగ్లాదేశ్ బ్యాటర్లు డకౌట్ కాగా.. తాంజిద్ హసన్ (25)లు ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్ లు రెండు వికెట్లు సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు షాక్‌లు ఇచ్చారు. తొలి ఓవర్‌లోనే సౌమ్య సర్కార్ (0)ను షమీ ఔట్ చేయగా ఆ మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (0)ను హర్షిత్ రాణా పెవిలియన్‌కు చేర్చాడు. ఇంకొద్ది సేపటికే మెహిదీ హసన్ మిరాజ్ (5) ను సైతం షమీ వెనక్కి పంపాడు. ఇక తొమ్మిదో ఓవర్‌లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో తాంజిద్ హసన్ (25), ముష్ఫికర్ రహీమ్ (0)లను ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Virat Kohli : సచిన్, ద్రవిడ్‌ల రికార్డులు బ్రేక్.. అజారుద్దీన్ రికార్డును సమం చేసిన కోహ్లీ..
INDIA NEED 229 TO BEAT BANGLADESH AT CHAMPIONS TROPHY. 🏆 pic.twitter.com/Yy1ODg7AgU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2025
ఈ క్రమంలో అక్షర్ హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. అయితే.. జాకీర్ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ మిస్ చేయడంతో అక్షర్ హ్యాట్రిక్ వికెట్లను అందుకోవడంలో విఫలం అయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని జాకీర్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తౌహిద్ హృదయ్‌తో జతకలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
ఈ జోడికి భారత పేలవ ఫీల్డింగ్ కూడా కలిసి వచ్చింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని జాకీర్‌ను ఔట్ చేయడం ద్వారా షమీ విడగొట్టాడు. వన్డేల్లో షమీకి ఇది 200వ వికెట్ కావడం విశేషం. తౌహిద్, జాకీర్ జోడీ ఆరో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
జాకీర్ ఔట్ అయినా గానీ తౌహిద్ తనదైన శైలిలో పరుగులు రాబడుతూ వన్డేల్లో రెండో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.