గౌతం గంభీర్‌తో ఐసీసీ చిట్ చాట్

అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా టీమిండియా ఆటగాళ్లను అభినందించే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మోసిసన ఐసీసీ.. గౌతం గంభీర్ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ మరోసారి ట్వీట్ చేసింది. 2018 సంవత్సరం చివర్లో గౌతీ అనూహ్యంగా రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ సంచలనం సృష్టించాడు. సోమవారం గౌతీ ఆడి గెలిచిన కప్‌లను, వ్యక్తిగతంగా అతను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోనుపోస్టు చేసింది.
ఆ వీడియోలో ‘గౌతం గంభీర్ ఇచ్చిన ఇంటర్వ్యూను.. అతను ఆడిన మ్యాచ్ హైలెట్స్‌తో జతచేసి పోస్టు చేసింది. గౌతం గంభీర్ తన కెరీర్లో మైలురాళ్లను గుర్తు చేసుకుంటూ ‘ఒక్కసారి వెనుకకు చూసుకుంటే ఇది చాలా పెద్ద జర్నీలా అనిపిస్తుంది. కానీ, ఈ జర్నీ నాకు సంతృకరంగానే అనిపిస్తుంది’ అని పేర్కొన్నాడు.
గౌతం గంభీర్ తాను గెలుచుకున్న ట్రోఫీలు, ఆయన సాధించిన మెడల్స్‌ను చూపిస్తూ మాట్లాడాడు. జట్టులో తాను ఎంతలా రాణించాడనేది, తన స్కోరు విజయాలకు ఎంత ప్రాముఖ్యం వహించిదనేది అందులో స్పష్టంగా కనిపిస్తోంది. స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్స్ బ్యాట్స్‌మన్ అయిన గౌతం గంభీర్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్‌లోనూ ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ విజయాన్ని తెచ్చిపెట్టాడు.
డిసెంబరు 2018న రిటైర్మెంట్ ప్రకటించిన గౌతం గంభీర్‌తో ఐసీసీ క్రికెట్ 360 ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. మీరూ చూడండి అంటూ పోస్టు చేసింది.
Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు
Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో
Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు