ODI Cricketer Of The Year 2023 : నలుగురు ఆట‌గాళ్ల మ‌ధ్య తీవ్ర పోటీ.. ముగ్గురు టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్లే..

వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 నామినీస్ జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం ప్ర‌క‌టించింది.

ODI Cricketer Of The Year 2023 : నలుగురు ఆట‌గాళ్ల మ‌ధ్య తీవ్ర పోటీ.. ముగ్గురు టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్లే..

ICC Mens ODI Cricketer of the Year 2023 nominees

ICC Mens ODI Cricketer of the Year 2023 : వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023 నామినీస్ జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం ప్ర‌క‌టించింది. ఈ అవార్డు కోసం న‌లుగురు ఆట‌గాళ్లు పోటీ ప‌డుతున్నారు. ఇందులో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు కావ‌డం విశేషం. భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన విరాట్ కోహ్లీ, మ‌హ్మ‌ద్ ష‌మీల‌తో పాటు గ‌త ఏడాది వ‌న్డేల్లో నిల‌క‌డ‌గా రాణించిన యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, న్యూజిలాండ్ ప్లేయ‌ర్ డారిల్ మిచెల్‌లు రేసులో నిలిచారు.

ఆసియాక‌ప్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. మెగాటోర్నీలో 11 మ్యాచుల్లో 765 ప‌రుగులు చేశాడు. అంతేకాదు వ‌న్డేల్లో 50 సెంచ‌రీలు చేసిన మొద‌టి ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ ఏడాది 27 మ్యాచులు ఆడిన కోహ్లీ 72.47 స‌గ‌టుతో 1377 ప‌రుగులు చేశాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ 7 మ్యాచుల్లో 24 వికెట్లు ప‌డ‌గొట్టి అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచాడు.

IND vs SA 2nd Test : రెండో టెస్టులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. సిరీస్ స‌మం..

మొత్తంగా ఈ ఏడాది 19 మ్యాచులు ఆడిన ష‌మీ 43 వికెట్లు ప‌డ‌గొట్టాడు. శుభ్‌మ‌న్ గిల్ ఈ ఏడాది 29 మ్యాచుల్లో 63.36 స‌గ‌టుతో 1584 ప‌రుగులు చేశాడు. ఇక డారిల్ మిచెల్ విష‌యానికి వ‌స్తే.. అత‌డు 26 మ్యాచుల్లో 1204 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే.. బుధ‌వారం ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (2023), మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2023) అవార్డుల కోసం నామినీస్‌ జాబితాల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. భార‌త స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌, జింబాబ్వే ఆట‌గాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ప్లేయ‌ర్‌ మార్క్‌ చాప్‌మన్‌, ఉగాండ ఆటగాడు అల్పేశ్‌ రామ్‌జనీ లు టీ20 ప్లేయ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు కోసం పోటీప‌డుతున్నారు.

Rohit Sharma : ధోని అరుదైన కెప్టెన్సీ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ, స‌చిన్ వ‌ల్ల కాలేదు..

టీమ్ఇండియా యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్‌, న్యూజిలాండ్ ప్లేయ‌ర్‌ రచిన్‌ రవీంద్ర, ద‌క్షిణాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ, శ్రీలంక ఆట‌గాడు దిల్షన్‌ మధుషంక లు ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులో ఉన్నారు.