ఐసీసీ అనుమానం: రాయుడుని టీంలోకి ఎందుకు తీసుకోలేదు

బీసీసీఐ ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ నెలల తరబడి శ్రమించి వరల్డ్ కప్‌కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్‌లకు సువర్ణావకాశం కల్పిస్తూ.. రిషబ్ పంత్, అంబటి రాయుడులకు హ్యాండ్ ఇచ్చింది. జట్టు ప్రకటించిన తర్వాత టీమిండియాలో అంబటి రాయుడును తీసుకోకపోవడానికి కారణమేంటని ఐసీసీ ప్రశ్నించింది.
ట్విట్టర్ వేదికగా వన్డే క్రికెటర్లలో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ ఉన్న ప్లేయర్లలో అంబటి రాయుడు ఒకరు. అటువంటి రాయుడుని పక్కన పెట్టడం వెనుక కారణం ఏముందని ఐసీసీ ప్రశ్నించింది. దాంతో పాటు బ్యాటింగ్ యావరేజ్ ఉన్న ప్లేయర్ల లిస్టును కూడా ఉంచింది.
విరాట్ కోహ్లీ – 59.57
మహేంద్ర సింగ్ ధోనీ – 50.37
రోహిత్ శర్మ – 47.39
అంబటి రాయుడు – 47.05
సచిన్ టెండూల్కర్ – 44.83
‘చాంపియన్స్ ట్రోఫీ 2017 అనంతరం కొద్ది మంది ప్లేయర్లను పరిశీలించి నెం.4 స్థానానికి విజయ్ శంకర్ సరిపోతాడని నిర్ణయించాం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు.
ఐపీఎల్ 2018 ప్రదర్శన ఫలితంగా రాయుడు తిరిగి టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. ఆసియా కప్.. వెస్టిండీయా సిరీస్‌లో రాణించడంతో కోహ్లీ నెం.4 స్థానంలో రాయుడు సరిగ్గా సరిపోతాడని భావించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల తర్వాత అతని ప్రదర్శన పేలవంగా కనిపిస్తుండటంతో మళ్లీ నాల్గో స్థానం గురించి ఆలోచన మొదలైంది. ఈ క్రమంలో రాయుడుని పక్కకు పెట్టి ఆ స్థానానికి మళ్లీ పరిశీలన మొదలుపెట్టారు.