T20 World Cup 2024 Schedule : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 షెడ్యూల్ వ‌చ్చేసింది.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 షెడ్యూల్ వ‌చ్చేసింది.

T20 World Cup 2024 Schedule : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 షెడ్యూల్ వ‌చ్చేసింది.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

T20 World Cup 2024 Schedule

Updated On : January 5, 2024 / 7:51 PM IST

T20 World Cup 2024 Schedule : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 షెడ్యూల్ వ‌చ్చేసింది. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 29న‌ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 20 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండ‌గా ఐదు గ్రూపులుగా విభ‌జించారు.

గ్రూపు ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, కెన‌డా, యూఎస్ లు ఉండ‌గా.. గ్రూపు బిలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న‌మీబియా, స్కాట్లాండ్‌, ఒమ‌న్ లు ఉన్నాయి. గ్రూపు సిలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌, ఉగాండ‌, ప‌పువా న్యూ గినియా లు ఉండ‌గా.. గ్రూపు డిలో సౌతాఫ్రికా, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, నెద‌ర్లాండ్స్‌, నేపాల్ జ‌ట్లు ఉన్నాయి.

Sam Harper : ప్రాక్టీస్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన స్టార్ క్రికెట‌ర్‌.. ఆస్ప‌త్రిలో కొన‌సాగుతోన్న చికిత్స‌

జూన్ 1న యూఎస్ఏ, ఉగాండ దేశాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచుతో ఈ పొట్టి స‌మ‌రం ప్రారంభం కానుండగా.. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు జూన్ 9న న్యూయార్స్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ షెడ్యూల్ ఇదే..
– జూన్ 5న ఐర్లాండ్‌తో
– జూన్ 9న పాకిస్థాన్ తో
– జూన్ 12న యూఎస్ఏతో
– జూన్ 15న కెనడాతో టీమ్ఇండియా త‌ల‌ప‌డ‌నుంది.


లీగ్‌, సెమీస్ షెడ్యూల్ ఇదే..

లీగ్ స్టేజీ మ్యాచులు జూన్ 1 నుంచి 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. సూప‌ర్ 8 మ్యాచులు జూన్ 19 నుంచి 24 వ‌ర‌కు, సెమీఫైన‌ల్ మ్యాచులు 26, 27 తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఫైన‌ల్ మ్యాచ్ జూన్ 29న బార్బ‌డోస్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ICC Test Rankings : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు ఊహించ‌ని షాక్‌.. వ‌ద‌ల‌ని ఆస్ట్రేలియా గండం..!