World Cup 2023 Tickets : టికెట్ల కోసం పోటెత్తిన అభిమానులు.. సైట్ క్రాష్.. మున్ముందు కష్టాలేనా..!
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల విక్రయాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రారంభించింది.

World Cup Tickets
World Cup Tickets : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల విక్రయాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రారంభించింది. అయితే.. ఇలా టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగా అలా అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు పని చేయలేదు. ఆ తరువాత అందుబాటులోకి వచ్చినా అప్పటికే సహనం కోల్పోయిన కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచ కప్ టికెట్లను బుక్ మై షో యాప్, వైబ్‌సైబ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. మొదటి రోజు వార్మప్ మ్యాచ్‌లతో సహా భారతేతర మ్యాచ్‌ల టికెట్లను శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి విక్రయించడం మొదలుపెట్టారు. అయితే.. ఫ్యాన్స్ నుంచి అధిక డిమాండ్ ఉండడంతో బుక్ మై షో యాప్, వెబ్ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయింది. సుమారు 35 నుంచి 40 నిమిషాల పాటు పని చేయలేదు. దీనిపై నెటీజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను అమ్మేటప్పుడు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని కామెంట్లు పెడుతున్నారు. ఆగస్టు 30 నుంచి టీమ్ఇండియా ఆడే మ్యాచులకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
టికెట్ల విక్రయాలు ఇలా..
ఆగస్ట్ 25 – నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
ఆగస్టు 30 – గౌహతి, త్రివేండ్రంలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
ఆగష్టు 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో,ముంబైలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్‌కతాలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 3 – అహ్మదబాద్‌లో జరిగే భారత మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల టికెట్లు లను విక్రయిస్తారు.
ICC Cricket World Cup 2023 –
Ticket sake for matches other than India started at 8PM✅
It’s 8:08 PM now – BookMyShow app is crashed 🫡
Cricket in India 🤝
Wondering what will happen when tickets for India’s game will go up on sale 🧐#ICCWorldCup2023 #WorldCup2023 #CWC23 pic.twitter.com/CzYZYEzTgV
— Nilesh G (@oye__nilesh) August 25, 2023
Yuvraj Singh : మరోసారి తండ్రైన యువరాజ్ సింగ్.. నిద్రలేని రాత్రులు సంతోషాన్నిస్తున్నాయి