RCB vs KKR : ఓడితే కోల్‌క‌తా ఇంటికే.. గెలిస్తే ఆర్‌సీబీకి పండగే.. చిన్న‌స్వామి వేదిక‌గా కీల‌క మ్యాచ్‌..

చిన్న‌స్వామి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.

RCB vs KKR : ఓడితే కోల్‌క‌తా ఇంటికే.. గెలిస్తే ఆర్‌సీబీకి పండగే.. చిన్న‌స్వామి వేదిక‌గా కీల‌క మ్యాచ్‌..

If kkr lost match to rcb today Kolkata will out of IPL 2025 playoff race

Updated On : May 17, 2025 / 11:09 AM IST

భార‌త్‌, పాక్ ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 సీజ‌న్ నేడు (శ‌నివారం మే17) నుంచి పునఃప్రారంభం కానుంది. చిన్న‌స్వామి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ ఎంతో కీల‌కంగా మారింది.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్‌సీబీ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.482గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఆర్‌సీబీ కొన‌సాగుతోంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సీబీ 18 పాయింట్ల‌తో ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జ‌ట్టుగా నిల‌వ‌నుంది.

Sunil Gavaskar : హార్దిక్ పాండ్యా పై సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్‌.. అతడు అలా చేయ‌డం లేదు.. అందుకే ముంబై ఇలా..

కేకేఆర్‌తో మ్యాచ్‌ కాకుండా లీగ్ ద‌శ‌లో ఆర్‌సీబీ మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే జ‌ట్టుకు ఫైన‌ల్ చేరుకునేందుకు రెండు అవ‌కాశాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో లీగ్ ద‌శ ముగిసేనాటికి ఆర్‌సీబీ తొలి రెండు స్థానాల్లో నిల‌వాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ మ్యాచ్‌లు గెల‌వాల్సి ఉంటుంది.

అటు కేకేఆర్ ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, మ‌రో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. 11 పాయింట్లు కేకేఆర్ ఖాతాలో ఉండ‌గా, నెట్‌ర‌న్‌రేట్ +0.193గా ఉంది. ఆర్‌సీబీతో మ్యాచ్ లో గ‌నుక కేకేఆర్ ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మిస్తుంది.

RCB vs KKR : కేకేఆర్‌తో మ్యాచ్‌.. ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ గాయం పై కీల‌క అప్‌డేట్‌..

హెడ్‌-టు- హెడ్ రికార్డులు..
ఆర్‌సీబీ, కేకేఆర్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 36 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెల‌వ‌గా, 21 మ్యాచ్‌ల్లో కేకేఆర్ విజ‌యం సాధించింది. ఇక చిన్న‌స్వామి స్టేడియంలో ఈ రెండు జ‌ట్లు 13 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 4 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది.