IND vs PAK: ఐఐటీ బాబా జోస్యం.. ఈరోజు పాకిస్తాన్ జట్టే గెలుస్తుందట..
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధిస్తుందని..

IIT baba
Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ హైఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు దుబాయ్ వేదికగా అమితుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సెమీఫైనల్స్ కు దూసుకెళ్తుంది. అదే పాకిస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీలో నిలవాలంటే ఇవాళ్టి మ్యాచ్ లో విజయం సాధించాల్సిందే. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో భారత్ జట్టే విజయం సాధిస్తుందని అధికశాతం మంది మాజీ క్రికెట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఇటీవల మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఐఐటీ బాబా మాత్రం షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు. ఇవాళ్టి మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుస్తుందని చెప్పాడు.
Also Read: IND vs PAK : ఈరోజు మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సెమీస్‌కు.. పాకిస్థాన్ ఓడిపోతే..
పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ పై ఐఐటీ బాబా మాట్లాడుతూ.. ‘‘నేను మొదటి నుంచి చెబుతున్నా.. ఈసారి టీమిండియాకు ఓటమి తప్పుదు. విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు ఎవరు ఎంతమంది ఆడినా టీమిండియాకు పరాజయం తప్పదు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మారదు. ఏం జరగాలని రాసిఉందో అది జరిగి తీరుతుంది. నేను గెలవదని చెప్పానంటే.. గెలవదు అంతే.. దేవుడు గొప్పా..? మీరు గొప్పా?’’ అంటూ ఐఐటీ బాబా కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాబా వ్యాఖ్యలపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఎవరీ ఐఐటీ బాబా..
ఐఐటీ బాబాగా పాపులర్ అయిన వ్యక్తిపేరు అభయ్ సింగ్. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. అతను ఒకప్పుడు ఐఐటీ బాంబే నుండి డిగ్రీ పొందిన ఏరోస్పేస్ ఇంజనీర్. అతను కెనడాలో అధిక జీతంతో ఉద్యోగం చేశాడట.. కానీ, తన కెరీర్ ను వదులుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. మహాకుంభమేళా సందర్భంగా సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను ఐఐటీ బాబాగా ప్రకటించుకున్నాడు. కుంభమేళాలో విశేష ప్రాచుర్యం పొందాడు. సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా హైఓల్టేజ్ మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధిస్తుందని అతను జోస్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ ఐఐటీ బాబా చెప్పిన జోస్యం నిజమా లేదా అబద్ధమా అని తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
View this post on Instagram