ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరగొచ్చు.. జోస్యం చెప్పిన గేల్.. ఆశ్చర్య పోతున్న అభిమానులు

టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు చేరుతుందని వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ జోస్యం చెప్పాడు. అయితే ఆస్ట్రేలియాతో పాటు ఫైనల్ ఆడే మరో జట్టుపేరును గేల్ తెలిపాడు. గేల్ వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరగొచ్చు.. జోస్యం చెప్పిన గేల్.. ఆశ్చర్య పోతున్న అభిమానులు

Chris Gayle

Updated On : October 11, 2022 / 1:00 PM IST

ICC T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభంలో శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈ బిగ్ టోర్నీలో పన్నెండు జట్లు పోటీపడనున్నాయి. అయితే, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వరకు ఏ రెండ్లు జట్లు చేరుతాయన్న దానిపై విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగొచ్చన్న అభిప్రాయం క్రికెట్ ప్రేమికుల నుంచి వినిపిస్తోంది. తాజాగా, వెస్టెండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ఏ జట్లు చేరుతాయన్న విషయపై సమాధానం ఇచ్చాడు. గేల్ చెప్పిన సమాధానంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

BCCI President: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ?

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు స్వదేశీలో టోర్నీ జరుగుతుండటం ప్రయోజనం చేకూర్చుతుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి కూడా గట్టిపోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై వెస్టెండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంటుందని గేల్ అన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో పాటు వెస్టెండీస్ ఫైనల్ లో తలపడుతుందని జోస్యం చెప్పాడు. గేల్ వ్యాఖ్యలతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

గేల్ అంచనా ప్రకారం.. వెస్టిండీస్ ఒక ప్రమాదకరమైన జట్టు. మ్యాచ్ రోజులలో సరైన వ్యూహాలను అమలు చేయడం ద్వారా విషయాలు వారికి అనుకూలంగా మారవచ్చు. వెస్టెండీస్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. జట్టు బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను అంటూ గేల్ అన్నాడు. గేల్ అంచనాపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. గేల్ అలా చెప్పడానికి చాలా ధైర్యం చేసిఉంటాడు. వెస్టెండీస్ మొదటి రౌండ్‌లో అర్హత సాధిస్తే చాలా అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. వెస్టెండీస్ కంటే ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఫైనల్‌కు వెళ్తాయన్నా నమ్మొచ్చు అంటూ సెటైరికల్ గా వ్యాఖ్యలు చేశాడు.