IND vs AFG 2nd T20 : రెండో టీ20 మ్యాచులో భారత్ ఘన విజయం
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు రెండో టీ20 మ్యాచులో తలపడ్డాయి.

IND vs AFG 2nd T20
భారత్ విజయం
173 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.4 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
శివమ్ దూబె హాఫ్ సెంచరీ..
నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో శివమ్ దూబే హాఫ్ సెంచరీ సాధించాడు.
Back to back half-centuries for Shivam Dube ??
What a fine half-century this off just 22 deliveries.
Live – https://t.co/YswzeUSqkf #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/Cec5R3T3xV
— BCCI (@BCCI) January 14, 2024
యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ..
మహ్మద్ నబీ బౌలింగ్‌లో సింగిల్ తీసిన యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
A quick-fire FIFTY by @ybj_19 off just 27 deliveries.
This is his fourth in T20Is.
Live – https://t.co/YswzeUSqkf #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/BXKB0DThzy
— BCCI (@BCCI) January 14, 2024
కోహ్లీ ఔట్..
భారత్ మరో వికెట్ కోల్పోయింది. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ అందుకోవడంతో విరాట్ కోహ్లీ (29; 16 బంతుల్లో 5 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 5.3వ ఓవర్‌లో భారత్ 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ శర్మ డకౌట్..
లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్‌లోని ఐదో బంతికి ఫజల్హక్ ఫారూఖీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 1 ఓవర్‌కు భారత స్కోరు 5/1. యశస్వి జైస్వాల్ (5), విరాట్ కోహ్లీ (0) లు ఆడుతున్నారు.
భారత లక్ష్యం 173
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ నైబ్ (57; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. నజీబుల్లా జద్రాన్(23), ముజీబ్ ఉర్ రెహమాన్ (21), కరీం జనత్ (20) లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. రవిబిష్ణోయ్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె ఓ వికెట్ పడగొట్టారు.
Four wickets fall in the final over as Afghanistan are all out for 172 runs in 20 overs.#TeamIndia chase underway.
Live – https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/uiAjfzf35O
— BCCI (@BCCI) January 14, 2024
గుల్బాదిన్ నైబ్ హాఫ్ సెంచరీ.. ఆ వెంటనే ఔట్..
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో గుల్బాదిన్ నైబ్ (57; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో అఫ్గాన్ 11.3 ఓవర్లలో 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
Excellent batting display by @GBNaib as he brings up a high-class half-century against India in the 2nd T20I. ??#AfghanAtalan | #INDvAFG2024 pic.twitter.com/lb0FZeT4Sq
— Afghanistan Cricket Board (@ACBofficials) January 14, 2024
అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్..
శివమ్ దూబె బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 6.5వ ఓవర్‌లో 60 పరుగుల వద్ద అఫ్గాన్ మూడో వికెట్ కోల్పోయింది.
ఇబ్రహీం జద్రాన్ క్లీన్‌బౌల్డ్..
అఫ్గానిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5.4వ ఓవర్‌లో 53 పరుగుల వద్ద అఫ్గాన్ రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 58/2. గుల్బాదిన్ నైబ్ (32), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1) లు ఆడుతున్నారు.
రహ్మనుల్లా ఔట్..
అఫ్గానిస్తాన్‌కు షాక్ తగిలింది. రహ్మనుల్లా గుర్భాజ్ (14; 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో శివమ్ దూబె చేతికి చిక్కాడు. దీంతో అఫ్గాన్ 2.2వ ఓవర్‌లో 20 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
Ravi Bishnoi draws the first blood for #TeamIndia as he picks up the wicket of Rahmanullah Gurbaz.
Live – https://t.co/YswzeUSqkf #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/CnQSoCepb3
— BCCI (@BCCI) January 14, 2024
అఫ్గానిస్తాన్ తుది జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహమాన్
భారత తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
Captain Rohit Sharma wins the toss and elects to bowl first in the 2nd T20I against Afghanistan.
Live – https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/Osi7XlapR4
— BCCI (@BCCI) January 14, 2024
IND vs AFG 2nd T20 : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు రెండో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సమం చేయాలని భారత్ ఆరాటపడుతోంది. అయితే.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని అఫ్గాన్ పట్టుదలగా ఉంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో అఫ్గాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక 14 నెలల విరామం తరువాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు.