IND vs AUS : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్.. తిలక్ వర్మ ఔట్.. రింకూసింగ్‌కు చోటు
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు (IND vs AUS ) ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి.
IND vs AUS 5th T20 Australia won the toss and opt to bowl
IND vs AUS : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆసీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. తిలక్ వర్మ స్థానంలో నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు చోటు ఇచ్చారు.
ప్రస్తుతానికి సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ (IND vs AUS ) గెలిచి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-2తో సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది.
‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చాలా బాగుంది. ఈ స్టేడియంలో ఆడడం ఎల్లప్పుడూ ఓ మధురానుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేస్తాం. జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ‘అని మిచెల్ మార్ష్ అన్నాడు.
మ్యాచ్‌లు గెలిచినంత వరకు టాస్ ఓడిపోయినా ఏం పర్వాలేదని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. జట్టు విజయం కోసం ఏం చేయాలో ఆటగాళ్లు అందరికి తెలుసునని చెప్పాడు. తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందన్నాడు. తిలక్ వర్మ స్థానంలో రింకూ సింగ్ వచ్చాడని చెప్పాడు.
ఆసీస్ తుది జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్( వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా
భారత తుది జట్టు..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
