IND vs AUS 2nd T20 : టీమ్ఇండియా ఘ‌న విజ‌యం

India vs Australia 2nd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు తిరువ‌నంత‌పురం వేదిక‌గా రెండో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి.

IND vs AUS 2nd T20 : టీమ్ఇండియా ఘ‌న విజ‌యం

IND vs AUS 2nd T20

Updated On : November 26, 2023 / 10:49 PM IST

భార‌త్ ఘ‌న విజ‌యం
236 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.

మార్క‌స్ స్టొయినిస్ ఔట్‌..
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్ష‌ర్ ప‌టేల్ క్యాచ్ అందుకోవ‌డంతో మార్క‌స్ స్టొయినిస్ (45; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 14.4వ ఓవ‌ర్‌లో 148 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది.

టిమ్‌డేవిడ్ ఔట్‌..
ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకోవ‌డంతో టిమ్ డేవిడ్ (37; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 13.3వ ఓవ‌ర్‌లో 139 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది.

10 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 103/4
ఆసీస్ ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 10 ఓవ‌ర్ల‌కు ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 104 ప‌రుగులు చేసింది. టిమ్‌డేవిడ్ (22), మార్క‌స్ స్టోయినిస్ (22) లు ఆడుతున్నారు. అంత‌క‌ముందు ప్ర‌సిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్ (19) ఔట్ అయ్యాడు.

మాక్స్‌వెల్ ఔట్‌..
అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ అందుకోవ‌డంతో మాక్స్‌వెల్ (12; 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. 6 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 53 3. మార్క‌స్ స్టోయినిస్ (0), స్టీవ్‌స్మిత్ (17)లు ఆడుతున్నారు.

జోష్ ఇంగ్లిస్ ఔట్‌..
ఆసీస్ మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌విబిష్ణోయ్ బౌలింగ్‌లో తిల‌క్‌వ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో జోష్ ఇంగ్లిస్ (2) ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 4.2వ ఓవ‌ర్‌లో 39 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

మాథ్యూ షార్ట్ ఔట్‌..
ల‌క్ష్య ఛేద‌న‌లో ఆసీస్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ర‌విబిష్ణోయ్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (19; 10 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 2.5వ ఓవ‌ర్‌లో 35 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా టార్గెట్ 236
రెండో టీ20 మ్యాచులో బ్యాట‌ర్లు దంచి కొట్ట‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 235 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాలు చేశారు. ఆఖ‌ర్లో రింకూ సింగ్ (31 నాటౌట్‌; 9 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కస్ స్టోయినిస్ ఓ వికెట్ తీశాడు.

ఇషాన్ కిష‌న్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. మార్క‌స్ స్టోయినిస్ బౌలింగ్‌లో నాథన్ ఎల్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో ఇషాన్ కిష‌న్ (52;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 15.2వ ఓవ‌ర్‌లో 164 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

సిక్స‌ర్‌తో ఇషాన్ హాఫ్ సెంచ‌రీ
తన్వీర్ సంఘ బౌలింగ్‌లో (14.4వ ఓవ‌ర్‌లో) సిక్స్ కొట్టి ఇషాన్ కిష‌న్ అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. 15 ఓవ‌ర్ల‌కు భార‌త్ వికెట్ న‌ష్ట‌పోయి 164 ప‌రుగులు చేసింది.

10 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 101/1
భార‌త ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 10 ఓవ‌ర్ల‌కు భార‌త వికెట్ న‌ష్ట‌పోయి 101 ప‌రుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (29), ఇషాన్ కిష‌న్ (10)లు ఆడుతున్నారు.

జైస్వాల్ అర్ధ‌శ‌త‌కం.. ఆ వెంట‌నే ఔట్‌
నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 24 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌రువాతి బంతికే జంపా క్యాచ్ అందుకోవ‌డంతో జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 5.5 ఓవ‌ర్ల‌లో 77 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 62/0
ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. 5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 62/0. య‌శ‌స్వి జైస్వాల్ (41), రుతురాజ్ గైక్వాడ్ (15)లు ఆడుతున్నారు.

భార‌త‌ తుది జ‌ట్టు : యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్‌), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

India vs Australia 2nd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు తిరువ‌నంత‌పురం వేదిక‌గా రెండో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.