ENG vs IND: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్టుకు వర్షం ఎఫెక్ట్..! టీమిండియాకు కష్టాలే.. ఒక్క స్పిన్నర్‌కే ఛాన్స్..?
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది.

Headingley Cricket Ground in Leeds City
ENG vs IND: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు లీడ్స్ లోని హెడింగ్లీ వేదికగా మొదలుకానుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. శుభ్‍మన్ గిల్ సారథ్యంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది.. ఎవరు ఏ స్థానంలో క్రీజులోకి వస్తారనే అంశంపై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ పూర్తిస్థాయిలో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. ఈ టెస్టు ఐదురోజులు కొనసాగాల్సి ఉండగా.. మూడు రోజులు వర్షం ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు, మూడో రోజు ఉదయం ఒక గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటం వల్ల ఆటకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. మూడు, నాలుగో రోజు సాయంత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ వర్షం కారణంగా మరుసటి రోజు ఆటలో అవుట్ ఫీల్డ్‌పై ప్రభావం చూపవచ్చు. అయితే, మొదటి రోజు, నాల్గో రోజు ఆటకు వర్షం ఎఫెక్ట్ ఉండదని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది.
THE ANDERSON-TENDULKAR TROPHY KICKS OFF TODAY. 🏆pic.twitter.com/YRitclOZ86
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 20, 2025
తొలి టెస్టు జరిగే ఐదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లు లేకుండా ఇంగ్లాండ్ తో పోరుకు బరిలోకి దిగుతున్న శుభ్‌మన్ గిల్ సేనకు వాతావరణం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వాతావరణం బ్యాటర్లకు సవాలు విసరనుంది. పేస్ బౌలర్లకు మాత్రం అనుకూలించే అవకాశం ఉంది. మరోవైపు.. వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో టీమిండి తుది జట్టు ఎంపికలో కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.
భారత జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ముగ్గురు స్పిన్నర్లలో కేవలం ఒక స్పిన్నర్ కు మాత్రమే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలి టెస్టుకోసం భారత్ తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.