IND vs ENG 4th Test : నాల్గో టెస్టుకు రెడీ.. టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ వీడియో చూశారా.. సూపర్ వీడియో
ఇంగ్లాండ్ తో నాల్గో టెస్టుకు ముందు రాంచీ మైదానంలో టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Teamindia
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ ఇవాళ్టి నుంచి రాంచి వేదికగా ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ లలో 2-1 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది. వరుస విజయాలతో భారత్ జట్టు ఆటగాళ్లు జోరు మీదున్నారు. టీమిండియా సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్ పై కన్నేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో రాంచీలో విజయమే లక్ష్యంగా టీమిండియా ప్లేయర్స్ సన్నద్ధమవుతున్నారు.
Also Read : Ben Stokes : రాంచీ టెస్టు ముందు బెన్‌స్టోక్స్ కీలక వ్యాఖ్యలు.. ఇదేం పిచ్‌రా బాబు!
రాంచీ మైదానంలో మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మిగిలిన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/BCCI/status/1760692485058413030