Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ఐదో టీ20 మ్యాచ్‌లో అందుకున్న పలు రికార్డులు ఇవే..
ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.

IND vs ENG 5th t20 Abhishek has the highest individual score by an Indian in T20I History
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు శుభ్‌మన్ గిల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2023లో న్యూజిలాండ్ పై గిల్ 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
అభిషేక్ శర్మ – 135 పరుగులు – ఇంగ్లాండ్ పై (2025లో)
శుభ్‌మన్ గిల్ – 126 నాటౌట్ – న్యూజిలాండ్ పై (2023)
రుతురాజ్ గైక్వాడ్ – 123 నాటౌట్ – ఆస్ట్రేలియా పై (2023)
విరాట్ కోహ్లీ – 122 నాటౌట్ – అఫ్గానిస్థాన్ పై (2022)
రోహిత్ శర్మ – 121 నాటౌట్ – అఫ్గానిస్థాన్ పై (2024)
HISTORY BY ABHISHEK SHARMA 🇮🇳
– Abhishek has the highest individual score by an Indian in T20I History ⭐ pic.twitter.com/JvXjrjS57Q
— Johns. (@CricCrazyJohns) February 2, 2025
అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 13 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. 2017లో శ్రీలంక పై రోహిత్ శర్మ ఓ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు బాదాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో సంజూ శాంసన్, తిలక్ వర్మలు ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
అభిషేక్ శర్మ – 13 సిక్సర్లు – ఇంగ్లాండ్ పై (2025లో)
రోహిత్ శర్మ – 10 సిక్సర్లు – శ్రీలంక పై (2017లో)
సంజూ శాంసన్ – 10 సిక్సర్లు – దక్షిణాఫ్రికా పై (2024లో)
తిలక్ శర్మ – 10 సిక్సర్లు – దక్షిణాఫ్రికా పై (2024లో)
🚨 ABHISHEK SHARMA HAS THE MOST SIXES BY AN INDIAN IN A T20I INNINGS 🚨 pic.twitter.com/t9T3OXlSxs
— Johns. (@CricCrazyJohns) February 2, 2025
రెండో ఫాస్టెస్ట్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ జాబితాలో 35 బంతుల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ తొలి స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ – 35 బంతుల్లో – శ్రీలంక పై (2017)
అబిషేక్ శర్మ – 37 బంతుల్లో ఇంగ్లాండ్ పై (2025)
సంజూ శాంసన్ – 40 బంతుల్లో – బంగ్లాదేశ్ పై (2024)
ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, టీమ్ఇండియా ఆటగాడు రోహిత్ శర్మలు ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.
Virat Kohli : రంజీ మ్యాచ్‌లో ఔట్ చేసిన బౌలర్.. ఆటోగ్రాఫ్ కోసం వస్తే.. కోహ్లీ ఏమన్నాడంటే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 35 బంతుల్లో – బంగ్లాదేశ్ పై (2017)
రోహిత్ శర్మ (భారత్) – 35 బంతుల్లో- శ్రీలంక పై (2017)
అబిషేక్ శర్మ (భారత్) – 37 బంతుల్లో – ఇంగ్లాండ్ పై (2025)
జాన్సన్ చార్లెస్ (వెస్టీండీస్) – 39 బంతుల్లో- దక్షిణాఫికా పై (2023)
సంజూ శాంసన్ (భారత్) – 40 బంతుల్లో- బంగ్లాదేశ్ పై (2024)