IND vs ENG 5th T20 : టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమ్ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్.. ష‌మీ వ‌చ్చేశాడు.

ముంబై వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు ఐదో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి.

IND vs ENG 5th T20

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖ‌రి మ్యాచ్ ముంబై వేదిక‌గా ప్రారంభ‌మైంది. సిరీస్ ఇప్ప‌టికే భార‌త్ సొంతం అవ్వ‌డంతో ఈ మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. అయిన‌ప్ప‌టికి ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి భార‌త ఆధిప‌త్యాన్ని 3-2కు త‌గ్గించాల‌ని ఇంగ్లాండ్ భావిస్తోంది. మ‌రోవైపు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 4-1తో సిరీస్‌ను ఘ‌నంగా ముగించాల‌ని భార‌త్ ఆరాట‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ జ‌ట్టు టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, భార‌త జ‌ట్లు ఒక్కొ మార్పుతో బ‌రిలోకి దిగాయి. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మీని భార‌త్ జ‌ట్టులోకి తీసుకోగా మార్క్ వుడ్ ను ఇంగ్లాండ్ తీసుకుంది.

Virat Kohli : రంజీ మ్యాచ్‌లో ఔట్ చేసిన బౌల‌ర్‌.. ఆటోగ్రాఫ్ కోసం వ‌స్తే.. కోహ్లీ ఏమ‌న్నాడంటే..

కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. వికెట్ చాలా బాగుంది. మేము ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయాల‌ని అనుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌ద‌ని ఆశిస్తున్నాను. ప్రేక్ష‌కులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. మేము ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటాము. కుర్రాళ్ల‌కు ఏం చేయాలో తెలుసు. కొన్ని సార్లు రిస్క్ తీసుకునే క్ర‌మంలో విఫ‌లం అవుతుంటారు. ఈ మ్యాచ్‌కు తుది జ‌ట్టులో ఒక్క మార్పు చేశాము. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మ‌హ్మ‌ద్ ష‌మీని తీసుకున్నాం అని చెప్పాడు.

Gongadi Trisha : తెలుగ‌మ్మాయి గొంగ‌డి త్రిష గురించి ఈ సంగ‌తులు మీకు తెలుసా? కూతురి కోసం ఆమె తండ్రి ఏం చేశాడంటే?

తుది జ‌ట్లు ఇవే..

భారత్..
సంజూ శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్‌..
ఫిలిప్ సాల్ట్(వికెట్ కీప‌ర్‌), బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్