Bairstow Century : భారత్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బెయిర్ స్టో సెంచరీ

ఇంగ్లండ్ ఓ దశలో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, బెయిర్ స్టో దూకుడుతో కోలుకుంది. బెయిర్ స్టో సెంచరీ చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో బరిలోకి దిగిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు.(Bairstow Century)

Bairstow Century : భారత్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బెయిర్ స్టో సెంచరీ

Bairstow Century

Updated On : July 3, 2022 / 7:30 PM IST

Bairstow Century : భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఓ దశలో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, బెయిర్ స్టో దూకుడుతో కోలుకుంది. బెయిర్ స్టో సెంచరీ చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో బరిలోకి దిగిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు.

బెయిర్ స్టో స్కోర్ లో 14 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్ లో సిరీస్ లోనూ రెండు సెంచరీలు బాదిన బెయిర్ స్టో.. వరుసగా మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సెంచరీ చేసిన కాసేపటికే బెయిర్ స్టో ఔటయ్యాడు. బెయిర్ స్టోను షమీ పెవిలియన్ పంపాడు. బెయిర్ స్టో 140 బంతుల్లో 106 పరుగులు చేశాడు.(Bairstow Century)

Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట

మూడో రోజు ఆట తొలి సెషన్ లోనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఔటయ్యాడు. 25 పరుగులు చేసిన స్టోక్స్ ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శామ్ బిల్లింగ్స్ తో కలిసి బెయిర్ స్టో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు.

కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సెంచరీలతో కదంతొక్కారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటిది చివరికి 416 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. జడేజా క్రీజులోకి రాకముందు.. వచ్చాక అదీ పరిస్థితి. టాప్‌ఆర్డర్‌ మొత్తం విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్‌తో కలిసి సుమారు 300 పరుగులు జోడించాడు. దీన్ని బట్టే అతడు ఈ మ్యాచ్‌లో ఎలాంటి పాత్ర పోషించాడో అర్థం చేసుకోవచ్చు.

Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

తొలుత రిషబ్ పంత్‌ (111 బంతుల్లో 146 పరుగులు.. 20 ఫోర్లు, 4 సిక్సులు)తో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించిన జడేజా తర్వాత షమీ (16)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు అందించాడు. పంతే సగం పరుగులు చేసినా.. భారత్ 400 పైచిలుకు స్కోర్‌ చేసిందంటే దానికి కారణం జడేజానే. జడేజా (194 బంతుల్లో 104 పరుగులు.. 13ఫోర్లు) టెస్టుల్లో మూడో శతకం సాధించాడు. ఇక షమీ, జడేజా ఔటయ్యాక చివర్లో తాత్కాలిక కెప్టెన్, పేసర్ బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు. బుమ్రా 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw