ఏంది సామీ ఇట్టా కొట్టావ్.. ఇంగ్లాండ్ బౌలర్ల మతిపోయింది..! గంభీర్‌నే నవ్వించావంటే నువ్వు సూపర్ బ్రో.. వీడియో వైరల్ ..

ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..

ఏంది సామీ ఇట్టా కొట్టావ్.. ఇంగ్లాండ్ బౌలర్ల మతిపోయింది..! గంభీర్‌నే నవ్వించావంటే నువ్వు సూపర్ బ్రో.. వీడియో వైరల్ ..

Akash Deep

Updated On : August 3, 2025 / 8:42 AM IST

IND vs ENG 5th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐదో టెస్టు జరుగుతుంది. ఈ టెస్టు రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. మూడోరోజు (శనివారం) 75/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగిపోగా.. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్, జడేజాలు ఆఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రెండోరోజు ఆట చివరిలో నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ అద్భుత ఆటతీరుతో ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

Also Read: వావ్.. ఏం కొట్టుడుకొట్టావ్ బ్రో.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించిన టీమిండియా ఆల్‌రౌండర్.. వీడియో వైరల్

నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్, యశస్వీ జైస్వాల్ మూడోరోజు టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఈ జోడీ సమర్ధవంతంగా ఎదుర్కొంది. టాపార్డర్ బ్యాటర్ తరహాలో ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 70బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. తన ఇన్నింగ్స్‌లో 12ఫోర్లు కొట్టడం విశేషం. ఆ తరువాత కూడా ఆకాశ్ దీప్ తన జోరు కొనసాగించాడు. మొత్తం అతను 94 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేశాడు. లంచ్ బ్రేక్‌కు ముందు అతను ఔట్ కావడంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.


నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఆకాశ్ దీప్.. ఆఫ్ సెంచరీ చేసిన తరువాత తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీ పూర్తి చేయడంతో డ్రస్సింగ్ రూం నుంచి శుభ్‌మాన్ గిల్, జడేజా, ఇతర ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశ్ దీప్ అనూహ్యంగా హాప్ సెంచరీ సాధించడంతో గంభీర్ సైతం చిరునవ్వులు చిందించాడు.

ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో డ్రెస్సింగ్ రూం వద్ద ఉన్న గంభీర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం గంభీర్ నవ్వుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. వావ్ ఆకాశ్.. గంభీర్‌నే నవ్వించావ్ కదయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. గంభీర్ నవ్వాడా.. ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత అంటూ సెటైర్లు పల్చేతున్నారు.