వావ్.. ఏం కొట్టుడుకొట్టావ్ బ్రో.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించిన టీమిండియా ఆల్‌రౌండర్.. వీడియో వైరల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తోనూ బాల్‌తోనూ అదరగొడుతున్నాడు. తాజాగా.. ఓవల్ మైదానంలోనూ ఆఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు..

వావ్.. ఏం కొట్టుడుకొట్టావ్ బ్రో.. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించిన టీమిండియా ఆల్‌రౌండర్.. వీడియో వైరల్

Washington Sundar

Updated On : August 3, 2025 / 7:29 AM IST

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. టీమిండియా బ్యాటర్లు అద్భుత ఆటతీరుతో ఇంగ్లాండ్ ముగింట భారీ లక్ష్యాన్ని ఉంచారు. మూడురోజు ఆటలో.. నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో అదరగొట్టగా.. చివరిలో వాషింగ్టన్ సుందర్ (53) ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బాల్‌తోనూ బ్యాట్‌తోనూఅదరగొడుతున్నాడు. మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో అతను తన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడం ద్వారా టీమిండియాను ఓటమి నుండి కాపాడాడు. ఓవల్ టెస్టు మ్యాచ్‌లోనూ వాషింగ్టన్ సుందర్ బ్యాటుతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తద్వారా ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకొని టీమిండియా మెరుగైన స్కోర్ సాధించడంలో సుందర్ కీలక భూమిక పోషించాడు.


ఓవల్ టెస్టులో మూడోరోజు ఆటలో క్రీజులోకి వచ్చిన సుందర్ కేవలం 39 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న సుందర్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేయగలిగింది.


మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో ఒక దశలో టీమిండియా ఓడిపోయే ప్రమాదం ఉంది. కానీ, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, తరువాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు సాధించి జట్టును ఓటమి నుంచి తప్పించారు. మాంచెస్టర్‌లో సుందర్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 206 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సు సహాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాజాగా.. ఓవల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో అతని ఆటతీరుపట్ల క్రికెట్ అభిమానులు ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.


బ్యాటింగ్‌లోనే కాదు..  బౌలింగ్‌లోనూ స్పిన్ మాయాజాలంతో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియాలో రవీంద్ర జడేజా తరువాత ఓ అద్భుత ఆల్‌రౌండర్‌గా ఈ టెస్టు సిరీస్ ద్వారా వాషింగ్టన్ సుందర్ పేరుగడించాడు.