IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డ్.. ప్రపంచకప్‌లో ఆధిపత్యం ఎవరిదో తెలుసా..?
వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

IND vs SA Head to Head Record
IND vs SA Head to Head Record : వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మెగాటోర్నీలో వరుస విజయాలతో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఏడు మ్యాచులు ఆడగా ఒక్క మ్యాచులో మాత్రమే ఓడి ఆరింటిలో గెలుపొందింది. అయితే.. ఆ ఓటమి నెదర్లాండ్స్ చేతిలో కావడం గమనార్హం.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోరు జరగనుండడంతో మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు భారత్, సౌతాఫ్రికా జట్లు వన్డే ప్రపంచకప్‌లో ఎన్ని సార్లు తలపడ్డాయి. వీటిలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది ఎవరు..? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటి వరకు 90 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 50 మ్యాచుల్లో గెలుపొందగా, దక్షిణాఫ్రికా 37 మ్యాచుల్లో విజయం సాధించింది. 3 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ మ్యాచుల విషయానికి వస్తే.. ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల్లో విజయం సాధించగా, భారత్ రెండు మ్యాచుల్లో గెలిచింది. 2003 నుంచి 2019 వరకు వరల్డ్ కప్లో గెలుపు ఓటములు చూసుకుంటే.. 3 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో రెండు టీమిండియా గెలుపొందగా, ఓ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది.
చూడాలి.. మరీ ఈ ప్రపంచకప్‌లో భారత వరుస విజయాల జైత్ర యాత్రకు సౌతాఫ్రికా బ్రేక్ వేస్తుందా..? లేక టీమ్ఇండియా తన గెలుపు యాత్ర కొనసాగుతుందో.
Shaheen Afridi : 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో.. ఓ పాకిస్థాన్ బౌలర్ చెత్త రికార్డు ఇదే..