Ind Vs SL : తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

తొలి టీ20లో లంకపై భారత్ ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 200 పరుగుల భారీ టార్గెట్ తో...

Ind Vs SL : తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

Ind Vs Sri Lanka

Updated On : February 24, 2022 / 10:39 PM IST

Ind Vs SL : తొలి టీ20లో లంకపై భారత్ ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక హాఫ్ సెంచరీతో రాణించాడు. 47 బంతుల్లో 53 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ తలో రెండు వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

Ind Vs SL India Won On Sri Lanka By 62 Runs

Ind Vs SL India Won On Sri Lanka By 62 Runs

లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లను ఊచకోత కోశారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

IPL 2022: ముంబై వేదికగా 55.. పుణెవేదికగా 15మ్యాచ్‌లు

ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. కిషన్ ఉన్నంతసేపు ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్… కిషన్ అవుటయ్యాక లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ 28 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 భారీ సిక్సులున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో లహిరు కుమార, శనక చెరో వికెట్ తీశారు.

IND vs SL 1st T20: శ్రీలంకతో సిరీస్.. నేటి నుంచే ప్రారంభం!

ఇషాన్‌ కిషన్‌ కు తన కెరీర్‌లో ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా, శ్రేయస్‌కు 4వది. మరోవైపు ఈ మ్యాచ్ లోనే కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. వ్యక్తిగత స్కోరు 37 పరుగుల దగ్గర టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ 3వేల 307 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్ 3వేల 299 పరుగులతో రెండో స్థానానికి, భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 3వేల 296 పరుగులతో మూడో స్ధానానికి పడిపోయారు.