IPL 2022: ముంబై వేదికగా 55.. పుణెవేదికగా 15మ్యాచ్‌లు

ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో 55మ్యాచ్ లు నిర్వహిస్తుండగా, పూణెలోని ఎమ్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 15మ్యాచ్ లు జరగనున్నాయట.

IPL 2022: ముంబై వేదికగా 55.. పుణెవేదికగా 15మ్యాచ్‌లు

Ipl Venues

IPL 2022: ఐపీఎల్ సంబరాలు వేలం ప్రక్రియతోనే మొదలైపోయాయి. ఈ మెగా టోర్నీ అధికారిక షెడ్యూల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో Cricbuzz వెబ్‌సైట్ నుంచి మ్యాచ్‌లు జరిగే వేదిక గురించి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది.

ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో 55మ్యాచ్ లు నిర్వహిస్తుండగా, పూణెలోని ఎమ్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 15మ్యాచ్ లు జరగనున్నాయట.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ ఆరంభించడానికి మార్చి 26లేదా మార్చి 27తేదీలను పరిశీలిస్తుంది. ఫిబ్రవరి 24న జరగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తో వేదికలు, తేదీలను కన్ఫమ్ కానున్నాయి.

Read Also: ఐపీఎల్ వేలంలో ఆ నాలుగు షాకింగ్ కొనుగోళ్లివే

ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికలు ఇంకా తేల్చాల్సి ఉంది. టోర్నమెంట్ ను మే29కంటే ముందే ముగిస్తారని కన్ఫామ్ గా తెలుస్తుంది. ఫిబ్రవరి 12, 13తేదీల్లో జరిగిన వేలంతో 10ఫ్రాంచైజీలు ప్లేయర్లతో ప్యాక్ అయ్యాయి.