IND vs WI : భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. వెస్టిండీస్ జ‌ట్టులో స్వ‌ల్ప మార్పులు.. స్టార్ పేస‌ర్ జోసెఫ్ ఔట్‌..

భార‌త్‌తో టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ జ‌ట్టులో (IND vs WI) స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

IND vs WI : భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. వెస్టిండీస్ జ‌ట్టులో స్వ‌ల్ప మార్పులు.. స్టార్ పేస‌ర్ జోసెఫ్ ఔట్‌..

IND vs WI Shamar Joseph ruled out of Test series Johann Layne named as replacement

Updated On : September 26, 2025 / 12:34 PM IST

IND vs WI : అక్టోబ‌ర్ 2 నుంచి భారత్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ (IND vs WI ) కోసం భార‌త్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు ఇప్ప‌టికే త‌మ త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. అయితే.. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టులో స్వ‌ల్ప మార్పులు చేసింది.

పేస‌ర్ ష‌మ‌ర్ జోసెఫ్ స్థానంలో జోహన్ లేన్ ను తీసుకుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ష‌మ‌ర్ జోసెఫ్ గాయ‌ప‌డ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. జోసెఫ్ సేవ‌ల కోల్పోవ‌డం పెద్ద లోటుగా అభివ‌ర్ణించింది.

IND vs SL : ‘భార‌త్‌ను ఓడించి.. మేము తోపులం అని నిరూపించుకుంటాం..’ మ్యాచ్‌కు ముందు దాసున్ షనక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

22 ఏళ్ల జోహన్ లేన్ తొలి సారి వెస్టిండీస్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఆల్‌రౌండ‌ర్ 19 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 66 వికెట్లు తీయ‌డంతో పాటు 495 ప‌రుగులు సాధించాడు. 12 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీయ‌డంతో పాటు 124 పరుగులు సాధించాడు. 5 టీ20 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ తీయ‌లేదు. బ్యాటింగ్‌లో ఒక్క‌సారి మాత్ర‌మే అవ‌కాశం రాగా ఒక్క ప‌రుగు చేశాడు.

భార‌త్‌తో సిరీస్ కోసం న‌వీక‌రించిన వెస్టిండీస్ జ‌ట్టు ఇదే..

రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ , టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, జోహన్ లేన్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడెన్ సీల్స్

IND vs PAK : 41 ఏళ్ల ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లోనే తొలిసారి ఇలా.. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో మ‌రీ..

భార‌త జ‌ట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ , దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాద‌వ్‌, ఎన్‌, జ‌గ‌దీష‌న్‌, సాయి సుద‌ర్శ‌న్‌.

షెడ్యూల్ ఇదే..

* తొలి టెస్టు – అక్టోబ‌ర్ 2 నుంచి 6 వ‌ర‌కు (అహ్మ‌దాబాద్)
* రెండో టెస్టు – అక్టోబ‌ర్ 10 నుంచి 14 వ‌ర‌కు (ఢిల్లీ)