WTC Final: ఓడిన టీమ్ఇండియాకు, గెలిచిన ఆసీస్‌కు ఐసీసీ భారీ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు 115 శాతం జరిమానా
లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే

ICC shock to team india
WTC Final 2023: లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు గెలుపు జోష్ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఇటు జట్లకు ఫైన్ పడింది. రోహిత్ సేనకు మ్యాచ్ ఫీజులో 100 శాతం, అటు కమిన్స్ సేనకు 80 శాతం కోత విధించింది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి టీమ్ఇండియా 5 ఓవర్లు, ఆసీస్ నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్లు తెలిపింది.
గిల్‌కు 115 శాతం జరిమానా
ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన శుభ్‌మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులకు ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో బొలాండ్ బౌలింగ్‌లో గిల్ షాట్ ఆడగా బంతి స్లిప్ వైపుకు దూసుకువెళ్లింది. కామెరూన్ గ్రీన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. కాగా.. ఈ క్యాచ్ వివాదాస్పదమైంది. బంతి నేలను తాకుతున్నట్లు కనిపించినా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో గిల్ నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
WTC Final: భారత్ ఘోర ఓటమి.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా..
ఇక మ్యాచ్ అనంతరం గిల్ తన సోషల్ మీడియాలో గ్రీన్ క్యాచ్ అందుకున్నప్పుడు బంతి నేలను తాకుతున్నట్లుగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. థర్డ్ అంపైర్ కు కళ్లు సరిగ్గా కనిపించడం లేదు అని అర్థం వచ్చేలా రెండు భూతద్దాలు, తలను చేత్తో కొట్టుకుంటున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీంతో అంపైర్ నిర్ణయాన్ని విమర్శించినందుకు గాను గిల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల్లోని 2.7 రూల్‌ను గిల్ ఉల్లంగించాడని, అందుకనే ఈ ఫైన్ వేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
????♂️ pic.twitter.com/pOnHYfgb6L
— Shubman Gill (@ShubmanGill) June 10, 2023
మొత్తంగా గిల్‌కు 115 శాతం జరిమానా పడింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్లందరికి 100 శాతం కోత విధించగా అక్కడ 100శాతం, అంపైర్ నిర్ణయాన్ని విమర్శించినందుకు 15 శాతం రెండు కలుపుకుని 115 శాతం జరిమానా పడింది.
Virat Kohli: మౌనమే మార్గం..! డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి తరువాత కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్..