ODI World Cup 2023: జై శ్రీరాం అంటూ పాక్ ప్లేయర్ ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. వారిలో అత్యధికులు భారతీయులే. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ భారత్ అనే నామస్మరణతో స్టేడియం మారుమోగి పోయింది.

ODI World Cup 2023: జై శ్రీరాం అంటూ పాక్ ప్లేయర్ ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

mohammad rizwan

ODI World Cup 2023 IND Vs PAK : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడో మ్యాచులోనూ విజ‌యం సాధించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ అగ్ర‌స్థానానికి చేరుకుంది. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Read Also : ODI World Cup 2023 IND Vs PAK: పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం.. మ్యాచ్ ఫొటో గ్యాలరీ

దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. వారిలో అత్యధికులు భారతీయులే. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ భారత్ అనే నామస్మరణతో స్టేడియం మారుమోగి పోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ను ఫ్యాన్స్ ఓ ఆటాడుకున్నారు. రిజ్వాన్ అవుట్ కాగానే డ్రెసింగ్ రూంకు వెళ్తున్న క్రమంలో ప్రేక్షకులు జై శ్రీరాం జై శ్రీరాం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : India vs Pakistan : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కు కోహ్లీ ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? వీడియో వైరల్

ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ రిజ్వాన్ స్టేడియంలో నమాజ్ చేశాడు. ఆట మధ్యలో డ్రింక్స్ టైమ్ లో అతను నమాజ్ చేశాడు. మ్యాచ్ మధ్యలో రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. అతను గతంలోనూ భారత్ తో జరిగిన టీ20 మ్యాచ్ లోకూడా మైదానంలోనే నమాజ్ చేస్తూ కనిపించాడు. అయితే, ఉప్పల్ లో నెదర్లాండ్ తో మ్యాచ్ సమయంలో రిజ్వాన్ నమాజ్ చేస్తున్న ఫొటోను, తాజాగా జై శ్రీరాం అంటూ భారత్ ఫ్యాన్స్ చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

ఈ వీడియోకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు.. 2017లో పాకిస్థాన్ అభిమానులు కూడా ఈ విధంగానే చేశారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు మ్యాచ్ అనంతరం భారత్ జట్టు డ్రెసింగ్ రూంకు వెళ్తున్న సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.