Rohit Sharma – Virat Kohli : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..

బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డ‌డంతో ఆగ‌స్టు నెల‌లో టీమ్ఇండియాకు ఎలాంటి మ్యాచ్‌లు లేకుండా పోయాయి.

Rohit Sharma – Virat Kohli : రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..

India likely to face Sri Lanka in August Report

Updated On : July 9, 2025 / 4:04 PM IST

వాస్త‌వానికి ఆగ‌స్టు నెల‌లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే.. అని కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సిరీస్‌ను ఓ ఏడాది పాటు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆగ‌స్టు నెల‌లో టీమ్ఇండియాకు ఎలాంటి మ్యాచ్‌లు లేకుండా పోయాయి.

ఇక ఇదే స‌మ‌యంలో జూలై నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు శ్రీలంక‌లో జ‌ర‌గాల్సిన లంక ప్రీమియ‌ర్ లీగ్ (ఎల్‌పీఎల్‌) కూడా వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలో శ్రీలంక క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న కోసం కేటాయించిన షెడ్యూల్ స్థానంలో శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ఆ వార్త‌ల సారాంశం.

Test Rankings : జోరూట్‌కు షాకిచ్చిన హ్యారీ బ్రూక్‌.. శుభ్‌మ‌న్ గిల్ కు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌..

భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్నారు. బీసీసీఐ ప్ర‌తిపాద‌న‌కు శ్రీలంక బోర్డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంట‌నే షెడ్యూల్ విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం లంక జ‌ట్టు బంగ్లాదేశ్‌తో ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ను ఆడుతుంది. ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో లంక గెలుచుకుంది. జూలై 10 నుంచి 16 వ‌ర‌కు టీ 20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత ఆగ‌స్టు చివ‌రి వారం వ‌ర‌కు శ్రీలంక జ‌ట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. ఆగ‌స్టు చివ‌రి వారంలో లంక జ‌ట్టు రెండు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల కోసం జింబాబ్వేకు వెళ్ల‌నుంది.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. లార్డ్స్‌లో భార‌త జ‌ట్టు గ‌ణాంకాలు ఇవే..

ఆగ‌స్టులోనే బ‌రిలోకి దిగనున్న‌ కోహ్లీ, రోహిత్..

టీ20లు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌కటించిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కేవ‌లం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం బంగ్లాదేశ్‌తో వ‌న్డే సిరీస్‌లో వీరిద్ద‌రు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా ప‌డ‌డంతో రోకో ద్వ‌యాన్ని మైదానంలో చూసేందుకు అక్టోబ‌ర్ వ‌ర‌కు ఆగాల్సి వ‌చ్చేది. అయితే.. ఇప్పుడు శ్రీలంక‌, బీసీసీఐ మ‌ధ్య జరుగుతున్న చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే.. రో-కో ద్వ‌యాన్ని ఆగ‌స్టులోనే టీమ్ఇండియా జెర్సీలో చూడొచ్చు.

రోహిత్‌, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో కలిసి ఆడారు.