వాన ఆడనిస్తుందా : దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ 20

క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా.. ఎలాగైనా పరువు నిలుపుకోవాలని సౌతాఫ్రికా… మొహాలీ గెలుపు ఇచ్చిన జోష్‌ను కంటిన్యూ చేయాలని కోహ్లీ సేన.. మరో మ్యాచ్ పోగొట్టుకోవద్దని డికాక్ టీమ్.. ఇలా ఎవరికి వాళ్లు పట్టుదలగా ఉండటంతో… బెంగళూరులో జరిగే టీ-20 లాస్ట్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. వరుణుడు బ్యాటింగ్‌కు దిగకపోతే.. టీమిండియాదే సిరీస్ అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం జరగనుంది. వర్షం కారణంగా ధర్మశాల మ్యాచ్ రద్దైంది. మొహాలీలో జరిగిన రెండో టీ-20లో ఏడు వికెట్ల తేడాతో గెల్చిన టీమిండియా… 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మొహాలీ జోషన్‌నే కంటిన్యూ చేయాలని టీమిండియా భావిస్తోంది. లాస్ట్ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. టీమ్ విషయానికి వస్తే.. కెప్టెన్ కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. సెకండ్ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన కోహ్లి.. భారత్‌కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ ధావన్‌తో కలిసి విరాట్ అద్భుతంగా ఆడాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ గురించే టీమిండియా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఎన్నో అవకాశాలిచ్చినా… చెత్త షాట్లతో వికెట్లు సమర్పించుకోవడం కామన్‌గా మారింది. ఈ మ్యాచ్‌తోనైనా నిరూపించుకోవాలని కసిమీదున్నాడు పంత్. శ్రేయాస్ అయ్యర్, మానిష్ పాండే, పాండ్యా బ్రదర్స్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.
టీ20ల్లో కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య పరుగుల పోటీ నడుస్తోంది. ప్రస్తుతానికి అత్యధిక పరుగుల వీరుడిగా కొహ్లీ కొనసాగుతున్నాడు. మొహాలి మ్యాచ్‌తో మొత్తం 2వేల 441 పరుగులు తీశాడు. కేవలం 71 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు. అయితే ఈ రికార్డును బద్దలు చేసేందుకు రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 2వేల 434 పరుగులు చేసిన రోహిత్.. కోహ్లీని దాటేందుకు కేవలం 8 పరుగుల దూరంలో ఉన్నాడు. ఎవరు ఎవరిని అధిగమిస్తారో చూడాలి.
బెంగళూరులో జరిగే చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. ఇక.. ఈ మ్యాచ్ ముంగిట చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ టీ20 రికార్డ్స్.. దక్షిణాఫ్రికాలో కంగారు పెంచుతోంది. మరోవైపు… టీ-20 జరిగే మ్యాచ్‌పై మేఘాలు కమ్మేశాయి. మ్యాచ్ సమయానికి వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.అయితే.. ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగినా టీమిండియాకే విజయావకాశాలున్నాయంటున్నారు.