India vs Sri Lanka : శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన.. షెడ్యూల్ వచ్చేసింది..
ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.

India to tour Sri Lanka for three ODIs and 3 T20Is schedule released by BCCI
టీమ్ఇండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ పర్యటన ముగిసిన తరువాత ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసింది. జూలై 26 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుండగా, ఆగస్ట్ 1 నుంచి వన్డే సిరీస్ జరగనుంది.
జూలై 26న తొలి టీ20, జూలై 27 రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా ఒక్క రోజు విరామం తరువాత జూలై 27న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్ ముగిసిన రెండు రోజుల గ్యాప్‌లోనే వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆగస్ట్ 1న తొలి వన్డే, ఆగస్ట్ 4న రెండో వన్డే, ఆగస్టు 7వ ఆఖరి వన్డే మ్యాచ్ జరగనుంది.
Brian Lara : లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే భారత ఆటగాళ్ల ఎవరంటే..?
టీ20 మ్యాచ్‌లన్నీ పల్లెకెలె స్టేడియంలో, వన్డేలన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. టీ20 మ్యాచులు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా, వన్డే మ్యాచులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆరంభం కానున్నాయి.
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటన నుంచే బాధ్యతలు చేపట్టనున్నాడు. టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అయినా వీరు ఆడతారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. వీరిద్దరికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇస్తే కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే టీ20ల్లో హార్దిక్ సారధ్యంలో భారత్ బరిలోకి దిగనుంది.
? NEWS ?
Fixtures for the upcoming India tour of Sri Lanka announced! ?#TeamIndia | #SLvIND pic.twitter.com/oBCZn0PlmK
— BCCI (@BCCI) July 11, 2024