అయ్యో.. ఇది టెస్టు సామీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మోత.. కానీ, బ్యాడ్‌లక్.. సెంచరీతో అదరగొట్టిన భారత సంతతి బ్యాటర్
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సూర్యవంశీ.. 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్, రెండు సిక్సులు ఉన్నాయి.

Vaibhav Suryavanshi
India u19 vs England U19: భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లను ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై ఆడాల్సి ఉండగా.. ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తయింది. వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత జట్టు.. 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి యూత్ టెస్టులో ‘డ్రా’గా ముగియగా.. రెండో యూత్ టెస్టు మ్యాచ్ ఆదివారం చెమ్స్‌ఫోర్డ్ వేదికగా మొదలైంది.
ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఐదు వన్డేల్లో 355 పరుగులు చేశాడు. అందులో విధ్వంసకర శతకం (143) ఉంది. టెస్టు మ్యాచ్ లో మాత్రం వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. టెస్టులను సైతం టీ20, వన్డేల తరహాలో ఆడుతుండటంతో అతను వెంటనే పెవిలియన్ బాటపడుతున్న పరిస్థితి. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ నిరాశపర్చిన వైభవ్.. రెండో ఇన్నింగ్స్ లో 44 బంతుల్లో 56 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు.. కానీ, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో నిరాశపర్చాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సూర్యవంశీ.. 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్, రెండు సిక్సులు ఉన్నాయి. టీ20 మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేయడంతో అతను వేగంగా ఔట్ అయ్యాడు. సోమవారం రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుశ్ మాత్రమే 24, మల్హోత్రా 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Ekansh Singh has a Youth Test 💯😮💨 pic.twitter.com/ETPMvPqprd
— Kent Cricket (@KentCricket) July 21, 2025
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అండర్ -19 జట్టు 309 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. కెప్టెన్ థామస్ ర్యూ (59) ఆఫ్ సెంచరీ చేయగా.. భారత సంతతికి చెందిన ఏకాన్ష్ సింగ్ (117) సెంచరీతో అదరగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 258 పరుగులు వెనుకబడి ఉంది.