IND vs ENG: భారత జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. నాల్గో టెస్టులోకి టీ20 స్పెషలిస్ట్.. తుది జట్టు ప్రకటన..
ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. నాల్గో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

IND vs ENG
IND vs ENG 4th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ ఈనెల 23వ తేదీ (బుధవారం) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. నాల్గో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఫోర్త్ టెస్టుకోసం టీ20 స్పెషలిస్ట్‌ను రంగంలోకి దింపింది.
Also Read: Champions League T20: ఛాంపియన్స్ లీగ్ టీ20 మళ్లీ వచ్చేస్తోంది..! ఎప్పటి నుంచి అంటే..
ఇప్పటికే సిరీస్ పై పట్టు సాధించిన ఇంగ్లాండ్ జట్టు.. మాంచెస్టర్ టెస్టులో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకొని భారత జట్టుకు బిగ్ షాకివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాల్గో టెస్టులో భారత్‌ను ఢీకొట్టబోయే జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. సుదీర్ఘ విరామం తరువాత లియామ్ డాసన్ తిరిగి ఇంగ్లాండ్ టెస్టు జట్టులో చేరాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత అతనికి టెస్టు జట్టులో చోటు దక్కింది. లార్డ్స్ టెస్టులో షోయబ్ బషీర్ గాయం కారణంగా ఫోర్త్ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు.
35ఏళ్ల డాసన్ చివరిసారిగా 2017లో నాటింగ్‌హోమ్‌లో దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. అంతకుముందు సంవత్సరం (2016)లో చెన్నైలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో ఏడు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 66 పరుగులు చేశాడు. చాలాకాలంగా టీ20 లీగ్ లో ఆడుతున్నాడు. అయితే, ఫోర్త్ టెస్టులో భారత జట్టు బ్యాటర్లను డాసన్ ఏమేరకు ఇబ్బంది పెడతారనేది వేచి చూడాల్సిందే.
నాల్గో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
Our XI for the fourth Test is here 📋
One change from Lord’s 👊
— England Cricket (@englandcricket) July 21, 2025