IND vs AUS : బాక్సింగ్ డే టెస్టు.. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడ్డ భారత్ జట్టు..!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో...

IND vs AUS : బాక్సింగ్ డే టెస్టు.. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడ్డ భారత్ జట్టు..!

Nitish Kumar Reddy

Updated On : December 28, 2024 / 9:06 AM IST

IND vs AUS 4th Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (82) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో రెండోరోజు (శుక్రవారం) ఆట పూర్తయ్యే సమయానికి భారత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పంత్, జడేజా క్రీజులో ఉన్నారు.

Also Read: Rohit Sharma: అశ్విన్ బాటలో రోహిత్..! మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్.. కీలక ప్రకటన చేసే అవకాశం

మూడోరోజు (శనివారం) ఉదయం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రిషబ్ పంత్ (28), రవీంద్ర జడేజా (17) అవుట్ అయ్యారు. ఆ తరువాత నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. మొదటి నుంచి వరుసగా వికెట్లు పడుతుండటంతో భారత్ ను ఫాలో ఆన్ గండం భయపెట్టింది. నితీశ్ కుమార్ ఆఫ్ సెంచరీ చేయడంతో భారత్ జట్టు 275 పరుగుల మార్క్ ను దాటేసి ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది.

Also Read: Rohit Sharma fail : ఓపెన‌ర్‌గానూ రోహిత్ శ‌ర్మ విఫ‌లం.. వ‌దిలేసే బంతిని ఆడి.. రిటైర్‌మెంట్ స‌మయం ఆస‌న్న‌మైందా?

నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆఫ్ సెంచరీ చేసిన తరువాత నితీశ్ పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్ ను తన గడ్డం కిందనుంచి తిప్పుతూ పుష్ప సినిమాలోని సీన్ తరహాలో తగ్గేదేలే అంటూ తన సంతోషాన్ని వెలుబుచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.