Champions Trophy 2025: టీమిండియా తొలి పోరు.. ఆ జట్టుతో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే..
ఈ విజయ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ‘మెన్ ఇన్ బ్లూ’ బరిలోకి దిగుతోంది.

PC:ANI
భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ తొలి పోరుకు సిద్ధమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ టోర్నమెంట్‌లో రెండో పోరు కావడం విశేషం.
ఈ పోరులో రెండు జట్లు విజయం సాధించి మంచి ఆరంభాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాయి. ప్రత్యేకంగా, భారత జట్టు ఇంగ్లండ్‌పై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుని భారీ ఉత్సాహంతో చాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెడుతోంది.
ఈ విజయ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ‘మెన్ ఇన్ బ్లూ’ బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ జట్టు ఇటీవలి వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. దీంతో, అనేక జాగ్రత్తలు తీసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆశిస్తోంది.
PAK vs NZ: వారెవ్వా.. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి శతకం.. కివీస్ ఓపెనర్ విల్‌యంగ్ అద్భుతం..
భారత్ vs బంగ్లాదేశ్ వన్డే హెడ్ టు హెడ్ రికార్డ్ (1988-2025)
భారత జట్టు, బంగ్లాదేశ్ 1988 నుంచి ఇప్పటి వరకు 41 వన్డే మ్యాచ్‌ల్లో తలపడాయి. ఇందులో 32 మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, బంగ్లాదేశ్ ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌కు ఫలితం రాలేదు. ఈ టోర్నమెంట్‌లో జరిగే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య 42వ వన్డే పోరుగా నిలవనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో
ఈ మెగాటోర్నమెంట్‌లో భారత్, బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.
తటస్థ వేదికలో
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండో మ్యాచ్ తటస్థ మైదానమైన దుబాయ్‌లో జరగనుంది. తటస్థ మైదానాల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు 12 సార్లు తలపడగా, భారత్ 10 సార్లు విజయం సాధించగా, బంగ్లాదేశ్ 2సార్లు గెలిచింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ఈ ఆసక్తికరమైన పోరు అభిమానులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం!