Abhishek Sharma: అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌.. యువరాజ్ సింగ్ 12ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈక్రమంలో 12యేళ్ల యువరాజ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌.. యువరాజ్ సింగ్  12ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్

Abhishek Sharma

Updated On : January 23, 2025 / 8:09 AM IST

Abhishek Sharma: ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో రాణించడంతో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు వరుణ చక్రవర్తి, అక్షర్ పటేల్ తోపాటు అర్ష్ దీప్ సింగ్, హార్ధిక్ పాండ్య అద్భుత బౌలింగ్ తో ఇంగ్లండ్ బ్యాటర్లను భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేశారు. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. తుఫాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Also Read: Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. బట్లర్ షాక్.. వీడియో వైరల్

ఇంగ్లాండ్ జట్టు టీమిండియా ముందుంచిన స్వల్ప పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు సునాయాసంగా ఛేదించింది. అభిషేక్ శర్మ క్రీజులోకి వచ్చిన సమయం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా సిక్సులు, ఫోర్లతో భారత్ స్కోర్ ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అతను కేవలం 20 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అభిషేక్ ఆఫ్ సెంచరీ పూర్తిచేసిన తరువాత మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 34బంతుల్లో 79 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అతను తన ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు బాదాడు.

Also Read: IND vs ENG 1st T20 : ప్ర‌పంచ రికార్డు పై తెలుగోడి క‌న్ను.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేనా?

టీ20 ఫార్మాట్ లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేయగా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు 2018లో మాంచెస్టర్ లో జరిగిన టీ20లో ఇంగ్లాండ్ పై రాహుల్ 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేయగా.. ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.

అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ జట్టుపై టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ బ్యాటర్ గా నిలిచాడు. 2007లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టగా.. 2022లో సూర్యకుమార్ యాదవ్ ఆరు సిక్సర్లు కొట్టాడు. అయితే, ప్రస్తుతం.. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఎనిమిది సిక్సులు కొట్టి వారి రికార్డును బద్దలు కొట్టాడు. అదేవిధంగా 12యేళ్లుగా యువరాజ్ పేరిట ఉన్న మరో రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.

రన్-ఛేజ్ సమయంలో టీ20 మ్యాచ్ లో వేగంగా పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగానూ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు (220.00 స్ట్రైక్ రేట్) చేయగా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన టీ20లో అభిషేక్ శర్మ 34 బంతుల్లో 74 పరుగులు (232.35 స్ట్రైక్ రేట్) చేశాడు. వీరితోపాటు భారతీయ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ 2016లో 51 బంతుల్లో 110 (215.68 స్ట్రైక్ రేటు), సూర్యకుమార్ యాదవ్ 2022లో 55 బంతుల్లో 117 పరుగులు (212.72) స్ట్రైక్ రేటు)తో 70 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇదిలాఉంటే.. ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టీ20లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.