IND vs ENG: కోహ్లీ, లివింగ్‌స్టోన్ మధ్య స్టేడియంలో వివాదం..! ఒకరినొకరు నెట్టుకున్నారు.. ఎందుకో తెలుసా..? వీడియో వైరల్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్ మధ్య జరిగిన స్వల్ప వాగ్వివాదంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Virat Kohli with Livingstone
India vs England 3rd ODI : ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే జరిగింది. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో రాణించాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. దీంతో కోహ్లీ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. దీనికితోడు శుభ్ మన్ గిల్ (112) సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (78) చెలరేగడంతో భారత్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 356 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకిదిగిన ఇంగ్లాండ్ జట్టు తడబాటుకు గురైంది. ఫలితంగా కేవలం 34.2 ఓవర్లలో 214 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ప్రకారం.. వీరి మధ్య అసలేం జరిగిందంటే.. విరాట్ కోహ్లీ చాలాకాలం తరువాత.. 2023 ప్రపంచ కప్ ఫైనల్స్ తరువాత ఇంగ్లాండ్ తో మూడో వన్డేలో అర్ధ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆదిల్ రషీద్ వేసిన బంతి అతని ప్యాడ్ ను తాకింది. అయితే, అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లాండ్ డీఆర్ఎస్ కు వెళ్లింది. రిప్లేలో బంతి లెగ్ స్టంప్ వెలుపల పడినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించారు. ఆ తరువాత కోహ్లీ వద్దకు లివింగ్ స్టోన్ వెళ్లాడు.
Also Read: IND vs ENG : వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
లివింగ్ స్టోన్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి ఆటపట్టించాడు. నువ్వు అవుట్ అయ్యే అవకాశం దగ్గరలోనే ఉంది అంటూ నవ్వుతూ కోహ్లీని ఆటపట్టించినట్లు వీడియోలో కనిపించింది. దీంతో కోహ్లీ సైతం నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో సరదాగా నవ్వుకుంటూనే ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, 55 బంతుల్లో 52 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని 19వ ఓవర్లో రసీద్ అవుట్ చేశాడు.
Virat Kohli with Livingstone 😂🤣🤣❤️ pic.twitter.com/bSy4i9jBhu
— MR. Haji 🦅🚁 (@always_Mega_fan) February 12, 2025
విరాట్ కోహ్లీ టీమిండియా జట్టు సభ్యులతోనేకాక ఇతర జట్ల సభ్యులతోనూ సరదాగా ఉంటాడు. అయితే, ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా గత ఏడాది చివరిలో జరిగిన వేలంలో ఆర్సీబీ జట్టు యాజమాన్యం లియామ్ లివింగ్ స్టోన్ ను కొనుగోలు చేసింది. రూ. 8.75కోట్లుకు లివింగ్ స్టోన్ ను ఆర్సీబీ దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన తరువాత లివింగ్ స్టోన్ కోసం నాలుగు ప్రాంచైజీలు వేలంలో పోటీపడ్డాయి. చివరికి బెంగళూరు జట్టు అతన్ని దక్కించుకుంది. ఆ తరువాత లివింగ్ స్టోన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బెంగుళూరులో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆర్సీబీ జట్టుకు ఎంపికైన తరువాత లివింగ్ స్టోన్ పేర్కొన్నాడు.