దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు : మయాంక్ డబుల్ సెంచరీ.. భారత్ 502/7 డిక్లెర్డ్

  • Published By: sreehari ,Published On : October 3, 2019 / 11:07 AM IST
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు : మయాంక్ డబుల్ సెంచరీ.. భారత్ 502/7 డిక్లెర్డ్

Updated On : October 3, 2019 / 11:07 AM IST

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు (202/0)తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. టెస్టుల్లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

దక్షిణాఫ్రికా బౌలర్ డీన్ ఎల్గర్ వేసిన తొలి ఓవర్ లో మయాంక్ (371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్స్) 215 పరుగులు చేసి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ జతగా (244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) 176 పరుగులతో సెంచరీ పూర్తి చేశాడు.

రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్ లో 317 పరుగుల దగ్గర రోహిత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ స్టంప్ ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ మయాంక్, రోహిత్ భాగస్వామ్యాన్ని వీడిదీశాడు.

దీంతో టీమిండియా తొలి వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర పుజారా(6), విరాట్ కోహ్లి (20), రహానే (15), విహారి (10), వృద్ధిమాన్‌ సాహా(21), రవిచంద్రన్ అశ్వన్ (1) ఒకరితరువాత మరొకరు పెవిలియన్‌ చేరారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ 3 వికెట్లు, ఫిలిండర్‌, డేన్‌ పీడ్త్‌, ముత్తుస్వామి, డీన్‌ ఎల్గర్‌లు తలో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికా తొలి వికెట్ ఫట్ : 
రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లుగా డీన్ ఎల్గర్, అడెన్ మార్కమ్ బరిలోకి దిగారు. ఎల్గర్ (38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) 18 పరుగులు చేయగా, మార్కమ్ (20 బంతుల్లో 1 ఫోర్) 5 పరుగులకే చేతులేత్తేశాడు.

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో మార్కమ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్రుయన్ (19 బంతుల్లో 1 ఫోర్) 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 12.5 ఓవర్లు ముగిసేరికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు 1 వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.