Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

శనివారం జరిగిన ఫైనల్స్‌లో పవిత్ర వెంకటేశ్ 4 మీటర్ల రేంజ్, రోసీ మీనా అనే మరో అథ్లెట్ 3.90 మీటర్ల రేంజ్ పూర్తి చేశారు. దీంతో పవిత్ర వెంకటేశ్‌కు సిల్వర్ మెడల్, రోసీ మీనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన మయూ నాసు బంగారు పతకం గెలుచుకుంది.

Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

Asian Indoor Championships: అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ‘ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్-2023’లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. తాజాగా మహిళా పోల్ వోల్ట్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు పతకాలు గెలుచుకున్నారు.

Minister KTR : తెలంగాణపై పగబట్టినట్లే వ్యవహరిస్తోన్న కేంద్రం : మంత్రి కేటీఆర్

శనివారం జరిగిన ఫైనల్స్‌లో పవిత్ర వెంకటేశ్ 4 మీటర్ల రేంజ్, రోసీ మీనా అనే మరో అథ్లెట్ 3.90 మీటర్ల రేంజ్ పూర్తి చేశారు. దీంతో పవిత్ర వెంకటేశ్‌కు సిల్వర్ మెడల్, రోసీ మీనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన మయూ నాసు బంగారు పతకం గెలుచుకుంది. వీరితోపాటు జ్యోతి యర్రాజి అనే మరో భారత్ అథ్లెట్ మహిళా హార్డిల్స్‌లో సత్తా చాటింది. 60 మీటర్ల హార్డిల్స్ పరుగును 8.16 సెకండ్లలోనే పూర్తి చేసి, అతి త్వరగా దీన్ని పూర్తి చేసిన క్రీడాకారిణుల్లో ఒకరిగా నిలిచింది. ఫైనల్ చేరింది. ఆదివారం ఫైనల్ రేసు జరుగుతుంది. గతంలో ఫ్రాన్స్‌లో జరిగిన హార్డిల్స్‌లో జ్యోతి నెలకొల్పిన 8.17 సెకండ్ల రికార్డును తనే ఈసారి బద్దలు కొట్టడం విశేషం.

Minister Harish Rao : బస్తీ దవాఖానాల సేవలతో పెద్దాస్పత్రుల్లో గణనీయంగా తగ్గిన ఓపీ : మంత్రి హరీశ్ రావు

జ్యోతితోపాటు మన దేశం నుంచి వీకే ఎలక్కియా దాసన్, అమ్లాన్ బొర్గోహైన్ కూడా సెమీ ఫైనల్ చేరారు. అయితే, ఫైనల్ చేరడంలో వీళ్లు విఫలమయ్యారు. ‘ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్-2023’లో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో ఇండియా నాలుగు మెడల్స్ గెలుచుకుంది. వీరిలో తజిందర్ పాల్ సింగ్ తూర్ అనే షాట్ పుట్ ప్లేయర్ బంగారు పతకం కూడా గెలుచుకున్నాడు. కరణ్ వీర్ సింగ్ షాట్ పుట్‌లో ఒక మెడల్, ప్రవీణ్ చిత్రావెల్ అనే అథ్లెట్ ట్రిపుల్ జంప్‌లో ఒక మెడల్, స్వప్నా బర్మాన్ అనే మరో అథ్లెట్ పెంటాథ్లాన్‌లో ఒక మెడల్ గెలుచుకున్నారు. ఈ రోజుతో ఈ గేమ్స్ పూర్తవుతాయి.