IND vs AFG 1st T20 : మొదటి టీ20 మ్యాచులో భారత్ ఘన విజయం
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడ్డాయి.

IND vs AFG 1st T20
భారత్ విజయం
159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబె (60 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టాడు.
శివమ్ దూబె హాఫ్ సెంచరీ..
తనకు వచ్చిన అవకాశాన్ని శివమ్ దూబె సద్వినియోగం చేసుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లకు భారత స్కోరు 148/4. శివమ్ దూబె (50), రింకూ సింగ్ (15) క్రీజులో ఉన్నారు.
A memorable Mohali outing for Shivam Dube ?
FIFTY ? for the left-hander and #TeamIndia are just 12 runs away from win ??
Follow the Match ▶️ https://t.co/BkCq71Zm6G#INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/VkBroq2hD4
— BCCI (@BCCI) January 11, 2024
జితేశ్ శర్మ ఔట్..
ముజీబ్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ అందుకోవడంతో జితేశ్ శర్మ (31; 20 బంతుల్లో 5 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 13.5 ఓవర్‌లో 117 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
తిలక్ వర్మ ఔట్..
టీమ్ఇండియా మరో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో గుల్బాదిన్ నాయబ్ క్యాచ్ అందుకోవడంతో తిలక్ వర్మ (26; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఔట్ అయ్యాడు.
గిల్ స్టంపౌట్
భారత్ మరో వికెట్ కోల్పోయింది. ముజీబ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (23; 12 బంతుల్లో 5 ఫోర్లు) స్టంపౌట్ అయ్యాడు. దీంతో భారత్ 3.5 ఓవర్లలో 28 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ శర్మ డకౌట్..
దాదాపు 14నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. శుభ్‌మన్‌గిల్‌తో ఏర్పడిన సమన్వయ లోపంతో అతడు రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి ఓవర్‌లోని రెండో బంతికే వికెట్ కోల్పోయింది. 1 ఓవర్‌కు భారత స్కోరు 5 1. గిల్ (4), తిలక్ వర్మ (1) లు క్రీజులో ఉన్నారు.
టీమ్ఇండియా టార్గెట్ 159
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (29), ఇబ్రహీం జద్రాన్ (25), రహ్మానుల్లా గుర్బాజ్ (23) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, శివమ్ దూబె ఓ వికెట్ సాధించాడు.
Innings Break!
Afghanistan post 158/5 on the board.
2⃣ wickets each for @akshar2026 & Mukesh Kumar
1⃣ wicket for Shivam DubeOver to our batters now ? ?
Scorecard ▶️ https://t.co/BkCq71Zm6G#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/E9Nnsn6Xx4
— BCCI (@BCCI) January 11, 2024
అజ్మతుల్లా ఒమర్జాయ్ క్లీన్ బౌల్డ్..
అఫ్గానిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (29; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 17.1వ ఓవర్‌లో 125 పరుగుల వద్ద అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.
రహమత్ షా క్లీన్ బౌల్డ్
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రహమత్ షా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 9.6వ ఓవర్‌లో 57 పరుగుల వద్ద అఫ్గాన్ మూడో వికెట్ కోల్పోయింది.
ఇబ్రహీం జద్రాన్ ఔట్..
అఫ్గానిస్తాన్ మరో వికెట్ కోల్పోయిన శివమ్ దూబె బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో ఇబ్రహీం జద్రాన్ (25; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 8.2వ ఓవర్‌లో 50 పరుగుల వద్ద అఫ్గాన్ రెండో వికెట్ కోల్పోయింది.
Shivam Dube with a wicket in his first over! ? ?
Captain @ImRo45 takes the catch. ? ?
2⃣nd success with the ball for #TeamIndia! ? ?
Follow the Match ▶️ https://t.co/BkCq71Zm6G#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/r6CDbOVL63
— BCCI (@BCCI) January 11, 2024
రహ్మనుల్లా గుర్బాజ్ ఔట్..
అఫ్గానిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో (7.6వ ఓవర్‌లో) రహ్మనుల్లా గుర్బాజ్ (23; 28 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 50 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ పడింది.
Breakthrough for #TeamIndia! ? ?@akshar2026 strikes as @jiteshsharma_ completes the stumping ? ?
Afghanistan lose Rahmanullah Gurbaz.
Follow the Match ▶️ https://t.co/BkCq71Zm6G #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/4yEu4Aqz63
— BCCI (@BCCI) January 11, 2024
ముగిసిన పవర్ ప్లే
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. 6 ఓవర్లకు అఫ్గానిస్తాన్ స్కోరు 330. ఇబ్రహీం జద్రాన్ (16), రహ్మనుల్లా (15) పరుగులతో ఆడుతున్నారు.
అఫ్గానిస్తాన్ తుది జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహమాన్
భారత తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
#TeamIndia Captain @ImRo45 wins the toss and elects to bowl first in the 1st T20I.
A look at our Playing XI for the game.
Live – https://t.co/hhj7wGbXqt #INDvAFG @IDFCFIRSTBank pic.twitter.com/AUlCcYwCXP
— BCCI (@BCCI) January 11, 2024
India vs Afghanistan : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో అఫ్గానిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది.