ఫైనల్ ఫైట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఫైనల్ ఫైట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియాకు మధ్య ఫైనల్ ఫైట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో నిర్ణయాత్మక వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదకగా జరగనుంది. మార్చి 13 బుధవారం మధ్యాహ్నం ఆరంభం కానున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. 

ఇప్పటికే సిరీస్‌లో 2-2తో సమంగా కొనసాగుతున్న జట్లకు ఈ మ్యాచ్ డిసైడింగ్ మ్యాచ్ కానుంది. టీమిండియాలో మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతాడనుకుంటే.. రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలతో బరిలోకి దిగాడు. మరో వైపు 2 వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయంతో పాటు సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. 
Read Also : జట్టులో 11మంది కోహ్లీలు ఉండరు

 

తుదిజట్లు:
టీమిండియా: 
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మొహ్మద్ షమీ

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆష్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, జై రిచర్డ్‌సన్, ఆడం జంపా, నాథన్ లయన్, మార్కస్ స్టోనిస్