IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం

డబ్లిన్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో మైదానం జలమయమైంది.

IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం

Indvsireland T20i Match

Updated On : June 26, 2022 / 10:40 PM IST

IndVsIreland T20I : డబ్లిన్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో మైదానం జలమయమైంది. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టనున్నాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా మరో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. సీనియర్లంతా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతుంటే, హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని యువ భారత్‌.. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్

మ్యాచ్‌ జరిగే మైదానం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురస్తోంది. దీంతోమ్యాచ్‌ ప్రారంభం అయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. మధ్యలో వరుణుడు కాస్త శాంతించాడు. ఆ సమయంలో అంపైర్లు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. మళ్లీ వరుణుడు పలకరించడంతో మైదానాన్ని వీడారు.

Virat Kohli: ఫ్యాన్‌ను తిట్టిపోసిన విరాట్ కోహ్లీ

భారత జట్టు..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్.

ఐర్లాండ్ జట్టు..
ఆండ్రూ బాల్ బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టకర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్ బ్రైన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కానర్ ఓల్ఫెర్ట్.