MS Dhoni : ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు.. ధోనీ, మోహన్‌లాల్.. పిక్ వైరల్
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లు ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు. దేని కోసం మీట్ అయ్యారు అని నెటీజన్లు ఆరా తీస్తున్నారు.

MS Dhoni- Mohanlal
MS Dhoni- Mohanlal : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ(MS Dhoni), మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal ) లు ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు. దేని కోసం మీట్ అయ్యారు అని నెటీజన్లు ఆరా తీస్తున్నారు. కాగా.. వీరిద్దరు ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అది ఏ యాడ్ అన్నది తెలియరాలేదు. త్వరలోనే యాడ్ ప్రొమో బయటకు రానుంది. ఇలా ఇద్దరు.. ఒక క్రికెట్ దిగ్గజం, మరో సినీ దిగ్గజాన్ని ఒకేసారి చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మహేంద్ర సింగ్ ధోని ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే విజేతగా నిలిచింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ట్రోఫీ అందుకున్న రోహిత్ తో సమంగా ధోని నిలిచాడు. కాగా..గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న మహేంద్రుడు ఐపీఎల్ ముగిసిన తరువాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొంతకాలం ఇంటిలో రెస్ట్ తీసుకున్న తరువాత ఇటీవలే అమెరికాలో విహారయాత్రకు వెళ్లి వచ్చాడు. అక్కడ యూఎస్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్‌ను వీక్షించాడు. అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సరదాగా గోల్ఫ్ ఆడాడు.
Shreyas Iyer : అయ్యర్‌కు చావో రేవో.. ఇలాగైతే స్థానం గల్లంతే..!
మరోవైపు.. మోహన్‌లాల్ నటుడిగానే కాకుండా సినిమా నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ.. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో సైతం నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
MS Dhoni with Mohanlal for an Ad shoot. pic.twitter.com/Ypy5eV4cgT
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2023