IPL 2019: ఆర్మీ దుస్తుల్లో KXIP హోలీ సంబరాలు

IPL 2019: ఆర్మీ దుస్తుల్లో KXIP హోలీ సంబరాలు

Updated On : March 21, 2019 / 1:27 PM IST

భారతదేశమంతటా రంగులతో నిండిపోయిన హోలీ పండుగను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలిపెట్టలేదు. కొందరు శుభాకాంక్షలు చెప్పి వదిలేస్తే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రత్యేక ఏర్పాట్లతో ప్లేయర్లను అలరించడమే కాకుండా అభిమానులకు చక్కని వినోదాన్ని అందించింది. 

పెయింట్ బాల్ పోటీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్లంతా పాల్గొని సరదాగా గడిపారు. కెప్టెన్ రవించంద్రన్ అశ్విన్.. మిగిలిన ప్లేయర్లు లోకేశ్ రాహుల్, ఆండ్రూ టైలతో కలిసి ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది పంజాబ్ టీం. 
Read Also : కోహ్లీ.. అనుష్క రొమాంటిక్ స్టీల్ యాడ్

కళ్లకు సేఫ్టీ కళ్లజోడుతో పాటు ఆర్మీ దుస్తుల్లో కనిపించిన ప్లేయర్లు ఆర్మీ క్యాంపు తరహాలో ఉన్న గ్రౌండ్‌లో సందడి చేశారు. విదేశీ ప్లేయర్లు సైతం భారత ఆర్మీ పోలీ ఉన్న దుస్తుల్లో ఒదిగిపోయి ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. పంజాబ్ జట్టు ఐపీఎల్ 2019 వేలంలో మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, శామ్ కరన్, నికోలస్ పూరన్‌లను జట్టులోకి చేర్చుకుంది. 

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో స్పెషలిస్ట్‌గా చెప్పుకొస్తుండగా ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, క్యారమ్ బాల్స్, ఫ్లిప్పర్స్, గూగ్లీస్ వేయగల దిట్టగా అతని రికార్డులు చెబుతున్నాయి. కాగా, ఫ్రాంచైజీ అతణ్ని రూ.8.4కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ 2019లో తొలి మ్యాచ్‌ను మార్చి 26 సోమవారం ఆడనుంది.