IPL 2019: రాయల్ చాలెంజర్స్ అదిరిపోయే రిప్లై ఇచ్చిన సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2019కి సర్వం సిద్ధం చేసుకుంటున్న మేనేజ్‌మెంట్ మంగళవారం రెండు వారాల పాటు జరగనున్న మ్యాచ్‌లకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ సీజన్‌కు తొలి మ్యాచ్‌ను ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న చెన్నైగడ్డపైనే నిర్వహించాలని నిర్ణయించుకుంది. మార్చి 23న జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఈ మేర రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సౌత్ ఇండియా వంటకమైన సాంబార్‌ను పోల్చి కౌంటర్ వార్ జరిగింది. ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ‘దక్షిణాది రెబల్ జట్టుతో పోరాడబోతున్నాం. కానీ, మాకు స్వీట్ సాంబార్‌లాగా మ్యాచ్ ఫలితం ఉండాలనుకుంటున్నాం. వివో ఐపీఎల్ 2019 బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో మొదలుకానుంది’ అని ట్వీట్ చేసింది.
దానికి సమాధానంగా చెన్నై సూపర్ కింగ్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘సాంబార్ స్వీట్‌గా కాదు… ఎల్లోవ్‌గా ఉండనుంది’ అంటూ బదులిచ్చింది. అంటే చెప్పకనే చెప్తూ తాము రెబల్ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లపై అభిమానుల నుంచి చక్కటి స్పందన వస్తుంది. చెన్నై, బెంగళూరు జట్ల అభిమానులు వరుస ట్వీట్లతో అభినందిస్తున్నారు.