IPL 2022: 25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు

స్టేడియాల్లోనికి ఎవరూ రావొద్దని సూచించినా.. ప్రస్తుతం 25శాతం కెపాసిటీతో మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

IPL 2022: 25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు

Ipl Title

Updated On : January 30, 2022 / 3:06 PM IST

IPL 2022: ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. 15వ సీజన్ కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వరుసగా మూడో ఏడాది పీడిస్తున్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలోకి అభిమానులను అనుమతించడం శోచనీయాంశమైపోయింది. దాదాపు స్టేడియాల్లోనికి ఎవరూ రావొద్దని సూచించినా.. ప్రస్తుతం 25శాతం కెపాసిటీతో మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

మొత్తం నాలుగు వేదికలుగా జరగనున్న లీగ్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్లేఆఫ్ లు జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు కొత్త జట్లతో నిర్వహించే లీగ్ మ్యాచ్ లు మొత్తం 70 జరుగుతాయి. అదే సమయంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

వేదికలు ఇంకా కన్ఫామ్ కాకపోయినప్పటికీ కనీసం 25శాతం ప్రేక్షకులతో మ్యాచ్ లు జరుగుతాయి. ముంబై, పూణెలలో కేసుల నమోదు తగ్గితేనే అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించే విషయం ఫైనల్ కాదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

Read Also : ముంబై డ్రగ్స్ డాన్ టోనీ ఎవరు ?

మార్చి చివరి వారంలో మొదలుకావాల్సి ఉన్న ఐపీఎల్ 2022.. రెండు నెలల పాటు జరగనుంది. దాని కంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగా వేలం నిర్వహిస్తుంది ఐపీఎల్ మేనేజ్మెంట్.