IPL 2022 : గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. పాండ్యా వస్తున్నాడు.. యో-యో టెస్టు పాస్..!
IPL 2022 : ఐపీఎల్ 2022 కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు శుభవార్త. పూర్తి ఫిట్ నెస్ సాధించిన టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు.

Ipl 2022 Good News For Gujarat Titans, Captain Hardik Pandya Passes Yo Yo Test With Flying Colours
IPL 2022 : ఐపీఎల్ 2022 కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కి శుభవార్త. పూర్తి ఫిట్ నెస్ సాధించిన టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు. వరుస గాయాలతో ఆటకు దూరమైన పాండ్యా ఎట్టకేలకు యో-యో టెస్టులో పాసయ్యాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2022 సీజన్‌కు అందుబాటులో ఉంటాడని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఒక ప్రకటనలో వెల్లడించింది. NCAలో రెండు రోజుల పాటు ఎక్కువ సమయం బౌలింగ్ చేసిన హార్దిక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
గాయాలతో బాధపడుతున్న క్రికెట్లరకు వారు ఫిట్ నెస్ సాధించారో లేదో నిర్ణయించేందుకు ఈ యో-యో టెస్టును నిర్వహిస్తారు. ఈ టెస్టులో హార్దిక్ పాస్ అయ్యాడు. దీనిపై బీసీసీఐ కూడా స్పందించింది. NCAలో పాండ్యా బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే అతడు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించాడని, గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలిగాడని తెలిపింది. Yo-Yo టెస్టులో రెండో రోజు పాండ్యా అదే జోరు కనబర్చి 17కి పైగా స్కోరు సాధించాడు. నిర్ణీత స్కోరు కంటే ఎక్కువ స్కోరు చేయడంతో పాండ్యా టెస్టులో ఉత్తీర్ణత సాధించినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఫిట్ నెస్ సాధించిన పాండ్యా.. ఐపీఎల్ సీజన్ 2022లో పూర్తిస్తాయిలో అందుబాటులో ఉండనున్నాడు.
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో విఫలమయ్యాడు. దానికితోడు వరుస గాయాలు పాండ్యా కెరీర్‌ను చిక్కుల్లో నెట్టాయి. అప్పటినుంచి ఎన్‌సీఏలో సుదీర్ఘకాలం పాటు పాండ్యా చికిత్స తీసుకున్నాడు. ఫలితంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించి యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించాడు. హార్దిక్ ఆటపై నమ్మకంతో గుజరాత్ ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందే రూ.15 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమించింది.
Nehraji, the OG! ?#SeasonOfFirsts #GujaratTitans pic.twitter.com/YuZSYeAZKF
— Gujarat Titans (@gujarat_titans) March 16, 2022
Yo-Yo టెస్టులో విఫలమైన పృథ్వీ షా..
అందిన సమాచారం ప్రకారం.. ఢిల్లీ టైటాన్స్ ఓపెనర్ పృథ్వీ షాకు Yo-Yo టెస్టులో విఫలమయ్యాడు. ప్రస్తుత ఫిట్‌నెస్ స్థితి సరిగా లేనందున ఓపెనర్ పృథ్వీ షా విఫలయత్నం చేశాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ స్టేటస్ సాధించేందుకు NCAలోనే ఉన్నాడు. ప్రస్తుత యో-యో టెస్ట్ క్వాలిఫికేషన్ స్కోర్ పురుషులకు 16.5 నిర్ణయించగా.. ముంబై ఓపెనర్ 15 కంటే తక్కువ స్కోర్ చేసినట్లు తెలిసింది. పృథ్వీ షా మూడు రంజీ మ్యాచ్‌లు బ్యాక్ టు బ్యాక్ ఆడాడు. మూడు ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడిన తర్వాత యో-యో స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమ్ మేనేజ్‌మెంట్, వైట్-బాల్ ఫార్మాట్‌లో షాకు బదులుగా రిజర్వ్ ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ను ఎంచుకున్నారు.
Read Also : IPL 2022 : చెన్నై సూపర్ కింగ్స్‌కు తీరని దెబ్బ.. ఆరంభ మ్యాచ్‌లకు గైక్వాడ్ దూరం..!