IPL 2022 : చెన్నై సూపర్ కింగ్స్‌కు తీరని దెబ్బ.. ఆరంభ మ్యాచ్‌లకు గైక్వాడ్ దూరం..!

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి జరుగబోయే ఐపీఎల్ టోర్నీకి పది జట్ల ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి.

IPL 2022 : చెన్నై సూపర్ కింగ్స్‌కు తీరని దెబ్బ.. ఆరంభ మ్యాచ్‌లకు గైక్వాడ్ దూరం..!

Navjot Singh Sidhu Navjot Sidhu Quits As Punjab Chief As Desired By Congress President (2)

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి జరుగబోయే ఐపీఎల్ టోర్నీకి పది జట్ల ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఐపీఎల్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు పలు జట్ల ఆటగాళ్లు దూరం కానున్నారు. అందులో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. గైక్వాడ్ జట్టులో లేకపోవడం చెన్నై జట్టుకు తీరని లోటుగా చెప్పవచ్చు. గత ఏడాది సీజన్‌లోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన ప్రదర్శనతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ ఏడాది సీజన్‌లో గైక్వాడ్ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో T20 సిరీస్‌కు ఆరంభానికి ముందు రుతురాజ్‌ గైక్వాడ్ చేతి గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ల్లో గైక్వాడ్ ఆడాలంటే ముందుగా అతడికి ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అతడి ఫిట్ నెస్ సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు ఆడేందుకు అనుమతి లభిస్తుంది. ఇప్పటికీ గైక్వాడ్ ఫిట్ నెస్ నిరూపించుకోలేదు. దాంతో ఐపీఎల్ సీజన్‌ తొలి వారంలో CSK ఆడబోయే మ్యాచ్‌లకు రుతురాజ్‌ దూరం కానున్నాడు. ఫిట్‌నెస్‌ సాధించేంతవరకు బెంగళూరులోని NCA అకాడమీలో రుతురాజ్‌ ప్రాక్టీస్ చేయనున్నాడు.  మార్చి 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో CSK తమ సీజన్ తొలి మ్యాచ్ ఆడనుంది.

Navjot Singh Sidhu Navjot Sidhu Quits As Punjab Chief As Desired By Congress President (1)

Navjot Singh Sidhu Navjot Sidhu Quits As Punjab Chief As Desired By Congress President (1)

రుతురాజ్‌ గైక్వాడ్.. మార్చి 17 లేదా 18న సూరత్‌లోని CSK జట్టుతో జరిగే మ్యాచ్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని CSK CEO కాశీ విశ్వనాథన్‌ అన్నారు. ఐపీఎల్ ఆరంభంలో రుతురాజ్‌ సీఎస్‌కే ఆడే మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గైక్వాడ్ ఇంకా ఫిట్నెస్ టెస్టు పూర్తి చేశాడో లేదా అనేది కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఇంకా పూర్తి కాలేదని సమాధానమిచ్చారు. రెండు రోజుల్లో గైక్వాడ్ ఫిట్నెస్ టెస్టుకు వెళ్లనున్నాడని వెల్లడించారు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని CSK జట్టులో మరో బౌలర్‌ దీపక్ చహర్‌ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

అతనితో పాటు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ డ్వెయిన్ ప్రిట్రోరియస్ కూడా ఆటకు దూరం కానున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించేందుకు National Cricket Academy (NCA)లో విశ్రాంతి తీసుకుంటున్నారు. IPL 2022 వేలంలో చాహర్‌ను రూ.14 కోట్లకు ఎంపిక చేయగా.. గైక్వాడ్‌ను CSK కొనసాగించింది. అదే సమయంలో ప్రోటీస్ ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్‌ను CSK రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో భుజం గాయంతో చహర్‌ శ్రీలంకతో జరుగబోయే T20 సిరీస్‌కు దూరమయ్యాడు. సీజన్‌ ప్రారంభంలోగా దీపక్‌ చహర్‌ సీఎస్‌కేలో చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Read Also : Virat Kohli: డివిలియర్స్ పేరు పిలిచిన అభిమానులు, విరాట్ వెనక్కు చూసి..