IPL 2022: వేలానికి విడిచిపెట్టినా సొంతగూటికి చేరుకున్న ప్లేయర్లు వీరే..
వేలానికి విడిచిపెట్టినప్పటికీ.. వేలంలో ఎంత ధర అయినా వెచ్చించి ఫ్రాంచైజీలు ఈ ఐదుగురిని తమ ఖాతాలోకే వేసుకోవాలని చూస్తున్నాయి.

Ipl 2022
IPL 2022: ఐపీఎల్ లోనే 2022 వేలం మరో మెగా వేలంగా మారింది. 2012 తర్వాత ఎనిమిది జట్లు గరిష్ఠంగా ప్లేయర్లను వేలానికి విడిచిపెట్టేశాయి. రూల్స్ ప్రకారం.. వేలానికి విడిచిపెట్టినప్పటికీ మళ్లీ తమ ఫ్రాంచైజీకే సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. వేలంలో ఎంత ధర అయినా వెచ్చించి ఫ్రాంచైజీలు ఈ ఐదుగురిని తమ ఖాతాలోకే వేసుకోవాలని చూస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ – ఇషాష్ కిషన్
మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ తో ట్రావెల్ అవుతున్న కిషన్… 1133పరుగులు చేశాడు. పలు పొజిషన్లలో బ్యాటింగ్ కు దిగి జట్టును ఆదుకోగలడు.
చెన్నై సూపర్ కింగ్స్ – శార్దూల్ ఠాకూర్
కెప్టెన్ కోరుకునే ఆల్ రౌండర్ శార్దూల్.. ఏ సిచ్యుయేషన్ లోనైనా బౌలింగ్ కు పంపిస్తాడు ఎంఎస్ ధోనీ. 2021 ఒక్క ఎడిషన్ లోనే 21వికెట్లు పడగొట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – దేవదత్ పడిక్కల్
స్టాండర్డ్ ఓపెనర్ పేరు తెచ్చుకున్న దేవదత్ పడిక్కల్ ఆడిన రెండో సీజన్ లోనే గుర్తింపు సంపాదించాడు. అసలు జట్టు వేలానికి విడిచిపెట్టడమే షాకింగ్ అనిపించినా వేలంలో కొనుగోలు చేయడం కచ్చితం అని తెలుస్తుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ – జాసన్ హోల్డర్
ఆరంజ్ ఆర్మీకి ప్రధాన బలాల్లో ఒకటి హోల్డర్. రషీద్ ఖాన్ తర్వాత రెండో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. 8మ్యాచ్ లలో 16వికెట్లు పడగొట్టాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ – శుభ్‌మన్ గిల్
ఇండియన్ క్రికెట్ లో సత్తా చాటుతున్న కుర్రాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకరు. టాప్ ఆర్డర్ లో పిల్లర్ లాంటి ప్లేయర్ గిల్. మరోసారి వేలంలో అతణ్ని సొంతం చేసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.