IPL 2023, DC vs GT: ఉత్కంఠభ‌రిత పోరులో గుజ‌రాత్‌పై ఢిల్లీ విజ‌యం..Live Updates

ఢిల్లీ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో గుజ‌రాత్ విఫ‌లమైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఢిల్లీ 5 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IPL 2023, DC vs GT: ఉత్కంఠభ‌రిత పోరులో గుజ‌రాత్‌పై ఢిల్లీ విజ‌యం..Live Updates

DC vs GT

Updated On : May 2, 2023 / 11:10 PM IST

IPL 2023, DC vs GT: ఐపీఎల్‌(IPL)2023లో భాగంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 02 May 2023 11:09 PM (IST)

    ఢిల్లీ విజ‌యం

    ఢిల్లీ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో గుజ‌రాత్ విఫ‌లమైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఢిల్లీ 5 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

  • 02 May 2023 11:00 PM (IST)

    తెవాటియా హ్యాట్రిక్ సిక్స‌ర్లు

    అన్రిచ్ నోర్జే 19వ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి మూడు బంతుల‌ను తెవాటియా సిక్స‌ర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తంగా 21 ప‌రుగులు వ‌చ్చాయి. 19 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 119/5. రాహుల్ తెవాటియా(20), హార్ధిక్ పాండ్యా(56) క్రీజులో ఉన్నారు. గుజ‌రాత్ విజ‌యానికి 6 బంతుల్లో 12 ప‌రుగులు కావాలి

  • 02 May 2023 10:48 PM (IST)

    మ‌నోహ‌ర్ ఔట్‌

    ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో అమన్ హకీమ్ ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో మ‌నోహ‌ర్ (26) ఔట్ అయ్యాడు. దీంతో గుజ‌రాత్ 94 ప‌రుగుల(17.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 98/5. రాహుల్ తెవాటియా(2), హార్ధిక్ పాండ్యా(53) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:43 PM (IST)

    హార్దిక్ పాండ్యా అర్ధ‌శ‌త‌కం

    కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో(16.2వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 44 బంతుల్లో 7 ఫోర్ల‌తో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 17 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 94/4. అభినవ్ మనోహర్(26), హార్ధిక్ పాండ్యా(51) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:41 PM (IST)

    పాండ్యా ఫోర్

    16వ ఓవ‌ర్‌ను అన్రిచ్ నోర్జే వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్ట‌గా మొత్తంగా 10 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 89/4. అభినవ్ మనోహర్(23), హార్ధిక్ పాండ్యా(49) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:36 PM (IST)

    8 ప‌రుగులు

    15వ‌ ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్‌ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్ట‌గా మొత్తంగా 8 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 79/4. అభినవ్ మనోహర్(21), హార్ధిక్ పాండ్యా(42) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:29 PM (IST)

    పాండ్యా ఫోర్‌

    14వ ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్ట‌గా మొత్తంగా 8 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 71/4. అభినవ్ మనోహర్(19), హార్ధిక్ పాండ్యా(36) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:25 PM (IST)

    4 ప‌రుగులు

    ప‌ద‌మూడో ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో 4 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 63/4. అభినవ్ మనోహర్(17), హార్ధిక్ పాండ్యా(30) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:19 PM (IST)

    6 ప‌రుగులు

    ప‌ద‌కొండో ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 55/4. అభినవ్ మనోహర్(13), హార్ధిక్ పాండ్యా(26) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:13 PM (IST)

    మ‌నోహ‌ర్ సిక్స్‌

    అక్ష‌ర్ ప‌టేల్ ప‌దో ఓవ‌ర్‌ను వేశాడు. తొలి బంతికి మ‌నోహ‌ర్ సిక్స్ కొట్ట‌డంతో మొత్తంగా 10 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 49/4. అభినవ్ మనోహర్(11), హార్ధిక్ పాండ్యా(24) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:10 PM (IST)

    నాలుగు ప‌రుగులు

    కుల్‌దీప్ యాద‌వ్ తొమ్మిదో ఓవ‌ర్‌ను క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 39/4. అభినవ్ మనోహర్(4), హార్ధిక్ పాండ్యా(22) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:06 PM (IST)

    రెండు ప‌రుగులు

    ఎనిమిద‌వ ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 35/4. అభినవ్ మనోహర్(2), హార్ధిక్ పాండ్యా(20) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 10:02 PM (IST)

    మిల్ల‌ర్ క్లీన్ బౌల్డ్‌

    గుజ‌రాత్ జ‌ట్టు వ‌రుసగా వికెట్ల‌ను కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు య‌త్నించిన డేవిడ్ మిల్ల‌ర్‌(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గుజ‌రాత్ 32 ప‌రుగుల(6.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 33/4. అభినవ్ మనోహర్(1), హార్ధిక్ పాండ్యా(19) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 09:58 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    గుజ‌రాత్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను అన్రిచ్ నోర్జే వేయ‌గా మూడో బంతికి పాండ్యా ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 5 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 31/3. డేవిడ్ మిల్ల‌ర్‌(0), హార్ధిక్ పాండ్యా(18) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 09:52 PM (IST)

    విజ‌య్ శంకర్ క్లీన్ బౌల్డ్‌

    ఐదో ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేయ‌గా ఆఖ‌రి బంతికి విజ‌య్ శంక‌ర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 26 ప‌రుగుల వ‌ద్ద గుజ‌రాత్ మూడో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 26/3. డేవిడ్ మిల్ల‌ర్‌(0), హార్ధిక్ పాండ్యా(12) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 09:42 PM (IST)

    గిల్ ఔట్‌

    గుజ‌రాత్ మ‌రో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్‌(6) మ‌నీష్ పాండే చేతికి చిక్కాడు. దీంతో గుజ‌రాత్ 18 ప‌రుగుల(3.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 20/2. విజ‌య్ శంక‌ర్‌(2), హార్ధిక్ పాండ్యా(12) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 09:39 PM (IST)

    మూడు ఫోర్లు

    హార్ధిక్ వ‌చ్చి రావ‌డంతోనే దూకుడుగా ఆడుతున్నాడు. ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన మూడో ఓవ‌ర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 18/1. శుభ్‌మ‌న్ గిల్‌(6), హార్ధిక్ పాండ్యా(12) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 09:35 PM (IST)

    గిల్ ఫోర్‌

    రెండో ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేశాడు. ఆఖ‌రి బంతికి గిల్ ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్ 6/1. శుభ్‌మ‌న్ గిల్‌(6), హార్ధిక్ పాండ్యా(0) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 09:32 PM (IST)

    సాహా ఔట్‌

    స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు గుజ‌రాత్ జ‌ట్టు బ‌రిలోకి దిగింది. వృద్దిమాన్ సాహ‌, శుభ్‌మ‌న్ గిల్‌లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేయ‌గా ఆఖ‌రి బంతికి ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో సాహా డ‌కౌట్ అయ్యాడు.

  • 02 May 2023 09:13 PM (IST)

    గుజ‌రాత్ ల‌క్ష్యం 131

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది. 23 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీ జ‌ట్టును అమన్ హకీమ్ ఖాన్(51; 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్‌(27; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రిపాల్ పటేల్(23; 13 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్ ) ప‌ర్వాలేద‌నిపించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ నాలుగు వికెట్లు తీయ‌గా, మోహిత్ శ‌ర్మ రెండు, ర‌షీద్ ఖాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

  • 02 May 2023 09:05 PM (IST)

    అమన్ హకీమ్ ఖాన్ ఔట్‌

    ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన అమన్ హకీమ్ ఖాన్(51) మ‌నోహ‌ర్ చేతికి చిక్కాడు. దీంతో 126 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు127 /7. అన్రిచ్ నోర్జే(1), రిపాల్ పటేల్(22) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:57 PM (IST)

    అమన్ హకీమ్ ఖాన్ అర్ధ‌శ‌త‌కం

    మోహిత్ శ‌ర్మ బౌలింగ్‌లో(17.3వ ఓవ‌ర్‌) రెండు ప‌రుగులు తీసి 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అమన్ హకీమ్ ఖాన్ అర్ధ‌శ‌తకం పూర్తి చేసుకున్నాడు. 18 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 119/6. అమన్ హకీమ్ ఖాన్(51), రిపాల్ పటేల్(15) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:53 PM (IST)

    రెండు ఫోర్లు

    17వ‌ ఓవ‌ర్‌ను జాషువా లిటిల్ వేశాడు. అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్ లు చెరో ఫోర్ కొట్ట‌డంతో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 107/6. అమన్ హకీమ్ ఖాన్(40), రిపాల్ పటేల్(14) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:49 PM (IST)

    సిక్స్, ఫోర్‌

    16వ ఓవ‌ర్‌ను మోహిత్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో అమన్ హకీమ్ ఖాన్ ఓ సిక్స్‌, ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 13 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 91/6. అమన్ హకీమ్ ఖాన్(35), రిపాల్ పటేల్(3) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:43 PM (IST)

    అక్ష‌ర్ ఔట్‌

    14వ‌ ఓవ‌ర్‌ను మోహిత్ శ‌ర్మ వేశాడు. రెండో బంతికి అక్ష‌ర్ ప‌టేల్ ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి బంతికి ర‌షీద్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో 73 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 73/6. అమన్ హకీమ్ ఖాన్(21), రిపాల్ పటేల్(0) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:31 PM (IST)

    అక్ష‌ర్ ప‌టేల్ ఫోర్‌

    13వ ఓవ‌ర్‌ను నూర్ అహ్మ‌ద్ వేశాడు. రెండో బంతికి అక్ష‌ర్ ప‌టేల్ ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 68/5. అమన్ హకీమ్ ఖాన్(19), అక్ష‌ర్ ప‌టేల్‌(24) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:28 PM (IST)

    3 ప‌రుగులు

    పన్నెండో ఓవ‌ర్‌ను ర‌షీద్ ఖాన్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో మూడు ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 61/5. అమన్ హకీమ్ ఖాన్(17), అక్ష‌ర్ ప‌టేల్‌(19) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:25 PM (IST)

    నాలుగు ప‌రుగులు

    ప‌ద‌కొండో ఓవ‌ర్‌ను నూర్ అహ్మ‌ద్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 58/5. అమన్ హకీమ్ ఖాన్(16), అక్ష‌ర్ ప‌టేల్‌(18) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:21 PM (IST)

    అక్ష‌ర్ ప‌టేల్ సిక్స్‌

    ప‌దో ఓవ‌ర్‌ను ర‌షీద్ ఖాన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి అక్ష‌ర్ ప‌టేల్ సిక్స్ కొట్టడంతో మొత్తంగా 10 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 54/5. అమన్ హకీమ్ ఖాన్(13), అక్ష‌ర్ ప‌టేల్‌(17) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:16 PM (IST)

    4 ప‌రుగులు

    నూర్ అహ్మ‌ద్ తొమ్మిదో ఓవ‌ర్‌ను క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ఈ ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 44/5. అమన్ హకీమ్ ఖాన్(12), అక్ష‌ర్ ప‌టేల్‌(9) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:13 PM (IST)

    అమన్ హకీమ్ ఖాన్ సిక్స్‌

    ర‌షీద్ ఖాన్ వేసిన ఎనిమిదో ఓవ‌ర్‌లోని ఐదో బంతిని అమన్ హకీమ్ ఖాన్ సిక్స్‌గా మ‌లిచాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 40/5. అమన్ హకీమ్ ఖాన్(11), అక్ష‌ర్ ప‌టేల్‌(7) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:06 PM (IST)

    అక్ష‌ర్ ప‌టేల్ ఫోర్‌

    మ‌హ్మ‌ద్ ష‌మీ ఏడో ఓవ‌ర్‌ను వేశాడు. మూడో బంతికి అక్ష‌ర్ ప‌టేల్ ఫోర్ కొట్టాడు. 7 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 32/5. అమన్ హకీమ్ ఖాన్(4), అక్ష‌ర్ ప‌టేల్‌(6) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:03 PM (IST)

    5 ప‌రుగులు

    జాషువా లిటిల్ ఆరో ఓవ‌ర్‌ను వేశాడు. ఆఖ‌రి బంతికి అమన్ హకీమ్ ఖాన్ ఫోర్ కొట్ట‌డంతో ఐదు ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 28/5. అమన్ హకీమ్ ఖాన్(4), అక్ష‌ర్ ప‌టేల్‌(2) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 08:00 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు

    మ‌హ్మ‌ద్ ష‌మీ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐదో ఓవ‌ర్ తొలి బంతికి వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవ‌డంతో మ‌నీశ్ పాండే(1) ఔట్ కాగా ఆఖ‌రి బంతికి ప్రియమ్ గార్గ్(10) సైతం సాహాకే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 23 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది ఢిల్లీ. 5 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 23/5.

  • 02 May 2023 07:51 PM (IST)

    6 ప‌రుగులు

    జాషువా లిటిల్ నాలుగో ఓవ‌ర్‌ను క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ఈ ఓవ‌ర్‌లో ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 22/3. మ‌నీష్ పాండే(1), ప్రియమ్ గార్గ్(10) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 07:48 PM (IST)

    రిలీ రోసో ఔట్‌

    ఢిల్లీ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో కీప‌ర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోవ‌డంతో రిలీ రోసో (8) ఔట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 16 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు16/3. మ‌నీష్ పాండే(0), ప్రియమ్ గార్గ్(5) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 07:40 PM (IST)

    వార్న‌ర్ ర‌నౌట్‌

    ఢిల్లీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. డేవిడ్ వార్న‌ర్ ర‌నౌట్ (2) అయ్యాడు. దీంతో 6 ప‌రుగుల(1.2వ ఓవ‌ర్‌) వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవ‌ర్‌లోని ఆఖ‌రి రెండు బంతుల‌కు రిలీ రోసో ఫోర్లు కొట్ట‌డంతో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 15/2. రిలీ రోసో(8), ప్రియమ్ గార్గ్(4) క్రీజులో ఉన్నారు.

  • 02 May 2023 07:35 PM (IST)

    ఫిల్ సాల్ట్ ఔట్‌

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి తొలి ఓవ‌ర్‌లోనే భారీ షాక్ త‌గిలింది. గ‌త మ్యాచ్‌లో ఆర్ధ‌శ‌త‌కం చేసి ఫామ్‌లోకి వ‌చ్చిన ఫిల్ సాల్ట్‌ను మ‌హ్మ‌ద్ ష‌మీ తొలి బంతికే ఔట్ చేశాడు. మిల్ల‌ర్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో ఫిల్ సాల్ట్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో ఐదు ప‌రుగులు వ‌చ్చాయి.

  • 02 May 2023 07:12 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

  • 02 May 2023 07:11 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), మనీష్ పాండే, రిలీ రోసో, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఇషాంత్ శర్మ

  • 02 May 2023 07:04 PM (IST)

    టాస్ గెలిచిన ఢిల్లీ

    టాస్ గెలిచిన ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్ వార్న‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.