IPL 2023: ఎవరెవరు సెంచరీలు చేశారు? అత్యధిక హాఫ్ సెంచరీలు చేసింది ఎవరో తెలుసా?

ఆరుగురు బ్యాటర్లు ఒక్కో సెంచరీ చొప్పున కొట్టారు.

IPL 2023: ఎవరెవరు సెంచరీలు చేశారు? అత్యధిక హాఫ్ సెంచరీలు చేసింది ఎవరో తెలుసా?

IPL 2023

Updated On : May 16, 2023 / 6:19 PM IST

IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ (IPL 2023)లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఆరుగురు బ్యాటర్లు ఒక్కో సెంచరీ చొప్పున బాదారు. వారిలో అయిదుగురు ఇండియన్లే ఉన్నారు. విదేశీ బ్యాటర్లలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న హ్యారీ బ్రూక్ (Harry Brook) మాత్రమే సెంచరీ చేశాడు.

ఆరుగురు.. 6 శతకాలు

బ్రూక్ 9 మ్యాచులు ఆడి ఓ దాంట్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మొత్తం 12 మ్యాచులు ఆడాడు. ఓ మ్యాచ్ లో 103 (నాటౌట్) పరుగులు చేశాడు. పంజాబ్ బ్యాటర్ సిమ్రాన్ సింగ్ 12 మ్యాచులు ఆడాడు. ఓ మ్యాచులో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.

శుభ్‌మన్ గిల్ 13 మ్యాచులు ఆడాడు. ఓ మ్యాచులో 101 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 13 మ్యాచులు ఆడాడు. ఓ మ్యాచులో 124 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 13 మ్యాచులు ఆడి, ఒకదాంట్లో 104 పరుగులు బాదాడు.

డు ప్లెసిస్ 7 అర్ధ శతకాలు

ఇక అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటర్ల జాబితాలో టాప్-5లో డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, డాన్ కాన్వే, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉన్నారు. ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ 7, విరాట్ కోహ్లీ 6, డాన్ కాన్వే 5, డేవిడ్ వార్నర్ 5, గ్లెన్ మ్యాక్స్ వెల్ 5 అర్ధ సెంచరీలు చేశారు. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్-2023 సీజన్ ముగియనుంది.

IPL 2023: శ‌త‌క్కొట్టిన శుభ్‌మ‌న్‌.. భువ‌నేశ్వ‌ర్ ఐదు వికెట్లు తీసినా.. హైద‌రాబాద్‌పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం