IPL 2023, PBKS vs GT: పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ గెలుపు
ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది.

PBKS vs GT
IPL 2023, PBKS vs GT: మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
LIVE NEWS & UPDATES
-
గెలిచిన గుజరాత్
మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
-
శుభ్ మన్ గిల్ అర్ధశతకం
ఓపెనర్ శుభ్ మన్ గిల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ చాహర్ వేసిన 16 ఓవర్‌లోని నాలుగో బంతిని ఫోర్‌గా మలచడంతో గిల్ ఈ ఘనతను అందుకున్నాడు. 16 ఓవర్లకు గుజరాత్ స్కోరు 120/3. డేవిడ్ మిల్లర్ 5, శుభమాన్ గిల్ 52 పరుగులతో ఉన్నారు.
-
హార్దిక్ పాండ్య ఔట్
గుజరాత్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 15 ఓవర్ రెండో బంతికి సామ్ కర్రన్ క్యాచ్ అందుకోవడంతో హార్దిక్ పాండ్య(8) ఔట్ అయ్యాడు. దీంతో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు గుజరాత్ స్కోరు 111/3. డేవిడ్ మిల్లర్ 2, శుభమాన్ గిల్ 47 పరుగులతో ఉన్నారు.
-
సాయి సుదర్శన్ ఔట్
గుజరాత్ మరో వికెట్‌ను కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ క్యాచ్ అందుకోవడంతో సాయి సుదర్శన్(19) ఔట్ అయ్యాడు. 12 ఓవర్లకు గుజరాత్ స్కోరు 91/2. హార్దిక్ పాండ్యా 1, శుభమాన్ గిల్ 40 పరుగులతో ఉన్నారు.
-
సాయి సుదర్శన్ ఫోర్
మాథ్యూ షార్ట్ వేసిన 11 ఓవర్ మూడో బంతికి సుదర్శన్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు స్కోరు 88/1. సాయి సుదర్శన్ 19, శుభమాన్ గిల్ 38 పరుగులతో ఉన్నారు.
-
రెండు ఫోర్లు
దీపక్ చాహర్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో గిల్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు స్కోరు 78/1. సాయి సుదర్శన్ 12, శుభమాన్ గిల్ 35 పరుగులతో ఉన్నారు.
-
పవర్ ప్లే
గుజరాత్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. సామ్ కర్రాన్ వేసిన ఆరో ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 6 ఓవర్లకు స్కోరు 56/1. సాయి సుదర్శన్ 5, శుభమాన్ గిల్ 20 పరుగులతో ఉన్నారు.
-
సాహా ఔట్
గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న సాహా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రబాడ వేసిన 5 ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్‌కు యత్నించిన సాహా(30) బౌండరీ వద్ద షార్ట్ చేతికి చిక్కాడు. 5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 52/1. సాయి సుదర్శన్ 4, శుభమాన్ గిల్ 17 పరుగులతో ఉన్నారు.
-
నాలుగు ఫోర్లు కొట్టిన సాహా
అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో సాహా రెచ్చిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 36/0. వృద్ధిమాన్ సాహా 24, శుభమాన్ గిల్ 11 పరుగులతో ఉన్నారు.
-
రెండు ఫోర్లు
కగిసో రబాడ వేసిన రెండో ఓవర్‌లోని రెండో బంతిని సాహా, ఆఖరి బంతిని గిల్ బౌండరీలకు తరలించారు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు గుజరాత్ స్కోరు 18/0. వృద్ధిమాన్ సాహా 11, శుభమాన్ గిల్ 6 పరుగులతో ఉన్నారు.
-
తొలి ఓవర్‌లో 7 పరుగులు
పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్ లు క్రీజులోకి అడుగుపెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి శుభ్‌మాన్ గిల్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 1 ఓవర్‌కు గుజరాత్ స్కోరు 7/0. వృద్ధిమాన్ సాహా 2, శుభమాన్ గిల్ 5 పరుగులతో ఉన్నారు.
-
గుజరాత్ లక్ష్యం 154
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 154 లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (36), జితేష్ శర్మ (25) పర్వాలేదనిపించగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ వేగంగా (9 బంతుల్లో 22 పరుగులు) ఆడడంతో పంజాబ్ 150 పరుగుల మార్క్‌ను దాటింది.
-
కర్రాన్ ఫోర్, షారుక్ ఖాన్ 6
షమి వేసిన 18 ఓవర్‌లోని నాలుగో బంతికి సామ్ కర్రాన్ ఫోర్ కొట్టగా ఆఖరి బంతికి షారుక్ ఖాన్ సిక్స్ బాదాడు. ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు పంజాబ్ స్కోరు 136/5. సామ్ కర్రాన్ 22, షారుక్ ఖాన్ 15 పరుగులతో ఉన్నారు.
-
రాజపక్స ఔట్
పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి భానుక రాజపక్స(20) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 17 ఓవర్లకు పంజాబ్ స్కోరు 121/5. సామ్ కర్రాన్ 16, షారుక్ ఖాన్ 6 పరుగులతో ఉన్నారు.
-
సామ్ కర్రాన్ సిక్స్
ఎట్టకేలకు మూడు ఓవర్ల తరువాత బంతి బౌండరీ లైన్ దాటింది. రషీద్ ఖాన్ వేసిన 16 ఓవర్‌లోని నాలుగో బంతికి కర్రాన్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 109/4. సామ్ కర్రాన్ 13, భానుక రాజపక్స 19 పరుగులతో ఉన్నారు.
-
జితేష్ శర్మ ఔట్
పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ వేసిన 13 ఓవర్‌లోని రెండో బంతికి సాహా క్యాచ్ అందుకోవడంతో జితేష్ శర్మ(25) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోరు 94/4. సామ్ కర్రాన్ 1, భానుక రాజపక్స 17 పరుగులతో ఉన్నారు.
-
10 పరుగులు
మహ్మద్ షమీ వేసిన 12వ ఓవర్‌లో జితేష్ శర్మ రెండు ఫోర్లు కొట్టాడు. ఓవర్ తొలి బంతిని, నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు పంజాబ్ స్కోరు 91/3. జితేష్ శర్మ 25, భానుక రాజపక్స 15 పరుగులతో ఉన్నారు.
-
జితేష్ శర్మ రెండు ఫోర్లు
పంజాబ్ స్కోరు వేగాన్నిపెంచే బాధ్యతను జితేష్ శర్మ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లోని తొలి బంతిని, నాలుగో బంతిని ఫోర్లుగా మలిచాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు పంజాబ్ స్కోరు 71/3, జితేష్ శర్మ 14, భానుక రాజపక్స 7 పరుగులతో ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
దూకుడుగా ఆడుతున్న మాథ్యూ షార్ట్ ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. రషీద్ బౌలింగ్‌ను అంచనా వేయడంతో పొరబడిన షార్ట్(36) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు పంజాబ్ స్కోరు 59/3, జితేష్ శర్మ 4, భానుక రాజపక్స 5 పరుగులతో ఉన్నారు.
-
పవర్ ప్లే
పంజాబ్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తి అయ్యింది. జాషువా లిటిల్ వేసిన ఆరో ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు పంజాబ్ స్కోరు 52/2, భానుక రాజపక్స 3, మాథ్యూ షార్ట్ 35 పరుగులతో ఉన్నారు.
-
12 పరుగులు
ఐదో ఓవర్‌ను అల్జారీ జోసెఫ్ వేశాడు. ఈ ఓవర్‌లో రెండో బంతిని బౌండరీకి తరలించిన మాథ్యూ షార్ట్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టారు. మొత్తంగా ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 42/2, భానుక రాజపక్స 1, మాథ్యూ షార్ట్ 28 పరుగులతో ఉన్నారు.
-
శిఖర్ ధావన్ ఔట్
పంజాబ్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. జాషువా లిటిల్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ క్యాచ్ అందుకోవడంతో శిఖర్ ధావన్(8) ఔట్ అయ్యాడు. దీంతో 28 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు పంజాబ్ స్కోరు 30/2, భానుక రాజపక్స 1, మాథ్యూ షార్ట్ 18 పరుగులతో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న మాథ్యూ షార్ట్
వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ క్రమంగా దూకుడు పెంచుతున్నాడు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన షార్ట్.. మహ్మద్ షమీ వేసిన మూడో ఓవర్‌లోనూ వరుసగా నాలుగు, ఐదు బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 27/1, శిఖర్ ధావన్ 8, మాథ్యూ షార్ట్ 18 పరుగులతో ఉన్నారు.
-
ధావన్ రెండు ఫోర్లు
జాషువా లిటిల్ వేసిన రెండో ఓవర్‌లో ధావన్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 16/1, శిఖర్ ధావన్ 8, మాథ్యూ షార్ట్ 8 పరుగులతో ఉన్నారు.
-
రెండో బంతికే వికెట్
టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే.. మహ్మద్ షమీ రెండవ బంతికే పంజాబ్‌కు షాకిచ్చాడు. ప్రభుమన్ సింగ్‌ను ఔట్ చేశాడు. స్కోరు బోర్డుపై పరుగుల ఖాతా తెరవకముందే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ నాలుగు, ఐదు బంతులను ఫోర్లుగా మలిచాడు. 1 ఓవర్‌కు పంజాబ్ స్కోరు 8/1, శిఖర్ ధావన్ 0, మాథ్యూ షార్ట్ 8 పరుగులతో ఉన్నారు.
-
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
-
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
-
టాస్ గెలిచిన గుజరాత్
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.